కాంట్రవర్సీ హుక్ స్టెప్పులు – హద్దులు దాటేస్తున్నారా?

ముఖ్యంగా 'మిస్టర్ బచ్చన్', 'డాకు మహారాజ్', 'రాబిన్ హుడ్' వంటి సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ నంబర్లు ఇప్పుడు డిబేట్‌కు దారి తీస్తున్నాయి.;

Update: 2025-03-10 14:45 GMT

ఇటీవల కాలంలో సినిమా పాటల హుక్ స్టెప్పులు కేవలం డ్యాన్స్ మూమెంట్స్‌కు పరిమితం కాకుండా, కాంట్రవర్సీలతో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. హుక్ స్టెప్పుల పేరుతో హీరోలు, హీరోయిన్లు చేస్తున్న కొన్ని మోషన్స్‌ పై విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ ట్రెండ్‌ను గతంలో కొన్ని పాటల్లో గమనించగలిగినా, తాజాగా ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా 'మిస్టర్ బచ్చన్', 'డాకు మహారాజ్', 'రాబిన్ హుడ్' వంటి సినిమాల్లోని ఐటమ్ సాంగ్స్, రొమాంటిక్ నంబర్లు ఇప్పుడు డిబేట్‌కు దారి తీస్తున్నాయి.

 

ఆ మధ్య, 'మిస్టర్ బచ్చన్' సినిమాలో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే జంటగా స్టెప్పులు వేసిన పాటలో కొన్ని స్టెప్పుల పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రవితేజ తన చేతులను హీరోయిన్ బ్యాక్ ప్యాకెట్ లో పెట్టడం పట్ల కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై దర్శకుడు హరీష్ శంకర్ వివరణ ఇచ్చినా, పాటపై నెగెటివ్ టాక్ కొనసాగింది.

 

ఇదే తరహాలో సంక్రాంతికి విడుదలైన 'డాకు మహారాజ్' సినిమాలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై రొటీన్ మాస్ స్టెప్పులు ట్రోల్‌కు గురయ్యాయి. దబిడి దిబిడే అనే ఆ పాటలో ఊర్వశి బ్యాక్ పై కొట్టినట్లు కంపోజ్ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇలాంటి సాంగ్స్ లో మితిమీరిన రొమాన్స్ ఎక్కువైందనే కామెంట్స్ కూడా వచ్చాయి.

 

ఇక రీసెంట్ గా, 'రాబిన్ హుడ్' సినిమాలోని అది దా సర్ ప్రైజు అనే పాటలో కేతికా శర్మ చేసిన హుక్ స్టెప్ప్ మరో వివాదంగా మారుతోంది. ఈ పాటలో ఆమె మల్లెపూల ఆభరణాలతో స్టెప్పులు వేస్తున్న తీరు, అలాగే నడుమును ఫ్లాంట్ చేస్తూ డిజైన్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. హుక్ స్టెప్పుల పేరుతో డ్యాన్స్ మూమెంట్స్‌ను మరీ ఘాటుగా తీసుకెళ్లడం అనేది ఓ ట్రెండ్‌గా మారిందని, ఇది కొంతవరకు అసహజంగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఊహించని విధంగా కాంట్రావర్సీకి దారి తీసిన ఈ మూడు పాటలకు కూడా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించడం ఆశ్చర్యం. స్పెషల్ సాంగ్స్ అంటే ఎక్కువగా శేఖర్ మాస్టర్ బెస్ట్ ఛాయిస్ అనేలా ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. అయితే ఆయన ఈమధ్య ఘాటైన స్టెప్పులతో కాంట్రవర్సీలో నిలుస్తుండడం అలవాటుగా మారింది అనేలా కామెంట్స్ అందుకుంటున్నారు.

అయితే ఒక పాట స్క్రీన్ పై కనిపించింది అంటే దర్శకుడి నిర్ణయం కూడా అందులో భాగమే. అతను ఒకే చెబితేనే మాస్టర్ కూడా అదే తరహాలో ముందుకు వెళతాడు. ఇక ఈ మూడు పాటలకు అందించిన కొరియోగ్రఫీ లో అందాల ప్రదర్శన కంటే మాస్ మూమెంట్స్‌ను మిక్స్ చేయడం ఎక్కువగా కనిపిస్తోంది. గ్లామర్ పాటలు ఎప్పటినుంచో తెలుగు సినిమాలో ఉన్నాయి, కానీ గతంలో పాటలకు ఒక క్లాస్ ఉండేది.

ఇప్పుడు మాత్రం, వాటిని హాట్ హుక్ స్టెప్పుల పేరిట ప్రేరేపించేలా తీర్చిదిద్దుతున్నారని, పాటల గ్లామర్ వేలు మీదకు వచ్చినంతవరకు ఓకే కానీ, మరీ హద్దులు దాటుతున్నాయా? అనే డిబేట్ నడుస్తోంది. ఇకపోతే, ఈ హుక్ స్టెప్పులపై సినిమా యూనిట్లు మాత్రం ప్రత్యేకంగా స్పందించలేదనే చెప్పాలి. దర్శకులు, కొరియోగ్రాఫర్లు వీటిని యూత్‌ను ఆకర్షించే అంశంగా చూస్తున్నారేమో కానీ, సోషల్ మీడియాలో మాత్రం దీనిపై హీట్ పెరుగుతోంది. ట్రెండ్ పేరుతో పాటలను కంట్రవర్సీగా మార్చడం, వైరల్ చేయడం ఆడియన్స్‌ను ఎంతవరకు ఆకర్షిస్తుందో కానీ, విమర్శలు పెరిగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

సినిమాలు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడం కోసం పాటల హుక్ స్టెప్పులు వేస్తున్నారనే విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ, కొన్నిసార్లు ఈ స్టెప్పులు అసహజంగా అనిపించడం, అవి గ్లామర్‌ను మించి మరీ ఘాటుగా ఉండడం వంటివి ట్రోలింగ్‌కు గురయ్యేలా చేస్తున్నాయి. చూడాలి మరి, ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా, లేక ప్రేక్షకుల అభిప్రాయాలను గమనించి మేకర్స్ కాస్త వెనక్కి తగ్గుతారా.

Tags:    

Similar News