కోర్టు కేసు: 'పుష్ప 2' లాభాలు కళాకారులకు పంచాలి
తాజాగా 'పుష్ప2' లాభాలను కళాకారులకు పంచాలంటూ తెలంగాణకు చెందిన న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేసారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 1800 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సంచలన విజయాన్ని పుష్ప టీమ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఓవైపు వివాదాలు చుట్టు ముట్టినా కానీ, పుష్ప సాధించిన అసాధారణ విజయం నేపథ్యంలో చిత్రబృందం అన్ని ఒత్తిళ్లను అధిగమిస్తోంది.
తాజాగా 'పుష్ప2' లాభాలను కళాకారులకు పంచాలంటూ తెలంగాణకు చెందిన న్యాయవాది నరసింహారావు హైకోర్టులో పిల్ వేసారు. ఆయన వాదన ప్రకారం... పుష్ప 2 లాభాలను చిన్న బడ్జెట్ సినిమాలకు రాయితీగా చెల్లించాలని పిల్ లో ప్రస్థావించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం... లాభాలను కళాకారుల సంక్షేమానికి ఉపయోగించాలని ఆయన వాదిస్తున్నారు. అయితే ఈ కేసులో విచారణను ధర్మాసనం రెండు వారాలకు వాయిదా వేసింది.
'పుష్ప 2' సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హక్కులను ఛేజిక్కించుకున్న పంపిణీదారులు, బయ్యర్లు సంతృప్తికరమైన లాభాలను ఆర్జించారు. అయితే కోర్టు కేసు ప్రకారం వీరంతా లాభాలను వెనక్కి ఇవ్వాలా? చిన్న బడ్జెట్ సినిమాలకు రాయితీగా చెల్లించాలా? జస్ట్ వెయిట్.. కోర్టు ఏమని తీర్పు చెబుతుందా?