బాలయ్య కోసం అభిమాని వెయిటింగ్ అంగీకరిస్తే అరుపులే!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలి సిందే.;
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో `జైలర్ -2`కి సన్నాహాలు జరుగుతోన్న సంగతి తెలి సిందే. `జైలర్` హిట్ అయిన అనంతరం నెల్సన్ పార్ట్ -2 పనుల్లోనే నిమగ్నమై పని చేస్తున్నారు. రజనీకాంత్ కూడా రెండవ భాగానికి గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో మరో హీరో ఆలోచన లేకుండా నెల్సన్ అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే పనిలో ఉన్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది.
ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈనేపథ్యంలో తాజాగా రజనీకాంత్ డేట్లు కూడా కేటాయిం చినట్లు తెలుస్తోంది. షూటింగ్ కి ఆయనా సిద్దమవుతున్నారు. తొలుత యాక్షన్ సన్నివేశాలతో చిత్రీకరణ ఆరంభిస్తున్నారు. `జైలర్` లో నటించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలు కూడా యధావిధిగా రెండవ భాగంలోనూ కొనసాగుతున్నాయి. అయితే టాలీవుడ్ నుంచి కూడా ఓ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నారని కొన్ని రోజులుగా వినిపిస్తున్నదే.
అయితే ఆ పాత్రకు నటసింహ బాలకృష్ణను కోరుతున్నట్లు తెలిసింది. ఆయన కూడా సానుకూలంగానే స్పందించారుట. బాలయ్య మాస్ ఇమేజ్ కి తగ్గట్టు సినిమాలో కొన్ని సన్నివేశాలు నెల్సన్ డిజైన్ చేసాడుట. సినిమాలో అది పోలీస్ పాత్ర అని సమాచారం. బాలయ్య పై మాస్ ఎలివేషన్ నెక్స్ట్ లెవల్లోనే ఉంటుందని సమాచారం. ఇక్కడే మరో విషయం కూడా లీకైంది. నెల్సన్ బాలయ్యకు వీరాభిమాని అట.
ఓ అభిమానిగా బాలయ్య ను డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారుట. ఆ అవకాశం `జైలర్ 2` ద్వారా దాదాపు వచ్చినట్లేనని సన్నిహితుల నుంచి లీకులందుతున్నాయి. నిజంగా ఈ సినిమాలో నటించడానికి బాలయ్య అంగీకరిస్తే గనుక జైలర్ 2 నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి హీరోలపైనే ఎలివేషన్ ఓరేంజ్లో ఉంటుంది. అలాంటింది బాలయ్య మాస్ ఇమేజ్ ముందు సరైన ఎలివేషన్ సీన్లు పడితే థియేటర్లో అరుపులే.