వాళ్ల స్పూర్తితోనే కియారా జర్నీ!
దీపికా పదుకొణే, అలియాభట్ గర్బం దాల్చిన తర్వాత షూటింగ్ ల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే.;
పెళ్లైన భామలకు..తల్లైన అమ్మలకు ఎంతటి డిమాండ్ ఉందో? చెప్పాల్సిన పనిలేదు. రెట్టింపు పారితోషికం అందుకుంటూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో గర్బం దాల్చినా షూటింగ్ లకు అడ్డం కాదంటూ చిత్రీకరణల్లో యధావిధిగా పాల్గొంటున్నారు. దీపికా పదుకొణే, అలియాభట్ గర్బం దాల్చిన తర్వాత షూటింగ్ ల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అలాగే రిలీజ్ సమయంలో ప్రచార కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఈ క్రమంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించారు. తాజాగా కియారా అద్వాణీ కూడా అదే మార్గంలో కొనసాగుతుంది. ఇటీవలే కియారా గర్భందాల్చిన విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కియారా రెండు సినిమాల షూటింగ్ లు పూర్తి చేయాల్సి ఉంది. బాలీవుడ్ లో `వార్ 2` లో, కన్నడలో `టాక్సిక్` చిత్రంలోనూ నటిస్తోంది. రెండు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
రెండు సినిమాల షూటింగ్ లు కూడా సవాల్ తో కూడుకున్నవే. రెండు భారీ యాక్షన్ చిత్రాలు కావడంతో? కియారా పై కూడా స్టంట్స్ చేయాల్సి వస్తోంది. అలాగని కియారా రిలాక్స్ అవ్వలేదు. గర్భం దాల్చిన తగిన జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లో పాల్గొంటుంది. దీపికా పదుకొణే `కల్కి 2898` కోసం, అలియాభట్ ఓ హాలీవుడ్ లో యాక్షన్ సన్నివేశాల కోసం ఇలాగే చిత్రీకరణలో పాల్గొంది.
అదే తరహాలో కియారా కూడా సెట్స్ కి హాజరవుతుంది. అయితే యూనిట్ కూడా ఆమెకు అవసరమైన అన్ని వసుతులు కల్పిస్తుంది. సెట్స్ లో డాక్టర్, అంబులెన్స్, ఎమర్జెన్సీ చికిత్సకు అవసరమైన సరంజామా అంతా సిద్దం చేసి పెడుతుంది. సెట్స్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు ఆయా యూనిట్లు తీసుకుంటున్నాయి.