ఇండ‌స్ట్రీలో ఎక్చేంజ్ మేళా వెరీ ఇంట్రెస్టింగ్!

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది వైపు రావ‌డం....ఇక్క‌డ భామ‌లు అక్క‌డ‌కెళ్లి స‌త్తా చాట‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.;

Update: 2025-03-10 14:30 GMT

ఒక‌ప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్లు అంటే ఎక్కువ‌గా బాలీవుడ్ లో స‌క్సెస్ అయిన భామ‌లే క‌నిపించేవారు. ముంబై మోడ‌ల్స్ ఎక్కువ‌గా దిగుత‌మ‌తి అయ్యేవారు. కానీ నేడు ట్రెండ్ మారిన సంగ‌తి తెలిసిందే. సౌత్ నుంచి ఎక్కువ‌గా టాలీవుడ్ కి దిగుమ‌తి అవుతున్నారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో సౌత్ టూ నార్త్..నార్త్ టూ సౌత్ అంటూ ఎక్చేంజ్ మేళా కూడా క‌నిపిస్తుంది. ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది వైపు రావ‌డం....ఇక్క‌డ భామ‌లు అక్క‌డ‌కెళ్లి స‌త్తా చాట‌డం అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల‌ గా నీరాజ‌నాలు అందుకుంటోన్న దీపికా ప‌దుకొణే 'క‌ల్కి 2898'తో, 'ఆర్ ఆర్ ఆర్' తో అలియాభ‌ట్, టాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ భామ‌లిద్ద‌రికీ టాలీవుడ్ లో జోరుగా అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కానీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవ‌లే సోనాక్షి సిన్హాకూడా 'జ‌ఠాధ‌ర‌'తో లాంచ్ అవుతుంది. ఈ సినిమాలో ఓ కీల‌క పాత్ర పోషిస్తుంది. వాస్త‌వానికి` లింగ` సినిమాతోనే సోనాక్షి సౌత్ లో లాంచ్ అయింది. కానీ అప్పుడు కానీ కొన‌సాగ‌లేదు.

తాజాగా సౌత్ మార్కెట్ డిమాండ్ చూసి ముందుకొస్తుంది. అలాగే కియారా అద్వాణీ సౌత్ కంటే ముందే బాలీవుడ్ లో ఫేమ‌స్ అయింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'గేమ్ ఛేంజ‌ర్' లోనూ న‌టించింది. జాన్వీ క‌పూర్ అయితే టాలీవుడ్ స్టార్ హీరోలే టార్గెట్ గా ప‌ని చేస్తోంది. ఇప్ప‌టికే తార‌క్ తో `దేవ‌ర‌`లో న‌టించింది. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలో నటిస్తుంది. అలాగే సిస్ట‌ర్ ఖుషీ క‌పూర్ కూడా కోలీవుడ్ లాంచింగ్ ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇలా బాలీవుడ్ భామ‌ల వెల్లువ సౌత్ లో క‌నిపిస్తుంది.

ఇక సౌత్ నుంచి నార్త్ లో స‌త్తా చాటుతున్న వాళ్ల‌లో ర‌ష్మికా మంద‌న్నా ముందు వ‌రుస‌లో ఉంది. మూడేళ్ల క్రితం `గుడ్ బై`తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక ఇప్పుడే స్థానంలో కొన‌సాగుతుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇటీవ‌లే 'ఛావా'తో గొప్ప చారిత్రాత్మ‌క విజ‌యం అందుకుంది. ప్ర‌స్తుతం లైన్ లో మూడు నాలుగు సినిమాలున్నాయి. అలాగే సాయి ప‌ల్ల‌వి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 'రామాయ‌ణ్'లో సీత పాత్ర‌లో న‌టిస్తోంది.

ఎంతో మంది బాలీవుడ్ భామ‌లున్నా నితీష్ తివారీ ఏరికోరి మ‌రీ సాయి ప‌ల్ల‌విని తీసుకున్నారు. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా బాలీవుడ్ డెబ్యూ కూడా ఫిక్సైంది. అమ్మ‌డి ఎన‌ర్జీ బాలీవుడ్ కి గ‌నుక క‌నెక్ట్ అయితే మామూలుగా ఉండ‌దు. అలాగే కీర్తి సురేష్ కూడా హిందీలో సినిమాల‌తో వెబ్ సిరీస్ ల్లోనూ న‌టిస్తోంది.

Tags:    

Similar News