పీపుల్స్ స్టార్ కోసం న్యాచురల్ స్టార్..?

ఐతే మళ్లీ నాని, శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ కోసం ఆయన్ను కలిశారన్న టాక్ వినిపిస్తుంది. మరి ప్యారడైజ్ కోసం నారాయణ మూర్తి తన సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా.;

Update: 2025-03-10 13:24 GMT

న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రెండో ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా ప్యారడైజ్. ఈ సినిమాను దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరినే నిర్మిస్తున్నారు. రీసెంట్ గా సినిమా నుంచి ఫస్ట్ రా స్టేట్మెంట్ గా వచ్చిన ప్యారడైజ్ టీజర్ ఆడియన్స్ ని అవాక్కయ్యేలా చేసింది. నాని సినిమా టీజరేనా ఇది అనిపించేలా రా అండ్ రియలిస్టిక్ కస్ వర్డ్స్ తో వచ్చింది టీజర్. ప్యారడైజ్ టీజర్ రిలీజైనప్పటి నుంచి సినిమా గురించి అందరు ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు.

ముఖ్యంగా సినిమా టీజరే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ ఓదెల దసరా తోనే షాక్ ఇచ్చాడు అనుకుంటే ప్యారడైజ్ దాన్ని మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. అంతేకాదు స్క్రిప్ట్ దశలోనే ఈ సినిమా సెన్సేషనల్ అనేలా ఉందట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కాస్టింగ్ గురించి కూడా స్పెషల్ గా చెప్పుకుంటున్నారు. సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ లో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తిని తీసుకునేలా చర్చలు జరుగుతున్నాయట.

రీసెంట్ గా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నారాయణ మూర్తిని కలిసిన కారణం ఇదే అని కూడా అంటున్నారు. నాని అంటే ఆర్. నారాయణ మూర్తికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒక సందర్భంలో నానిని ప్రశంసిస్తూ తెలుగు అమీర్ ఖాన్ అని అన్నారు నారాయణ మూర్తి. ఐతే సొంత కథలు.. సొంత సినిమాలే చేస్తూ దశాబ్దాల కాలంగా తన పంథా కొనసాగిస్తున్న ఆర్.నారాయణ మూర్తి అంతకుముందు భారీ సినిమాల ఆఫర్లు వచ్చినా కాదనేశారు.

ఐతే మళ్లీ నాని, శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ కోసం ఆయన్ను కలిశారన్న టాక్ వినిపిస్తుంది. మరి ప్యారడైజ్ కోసం నారాయణ మూర్తి తన సెంటిమెంట్ బ్రేక్ చేస్తారా.. నాని సినిమా కోసం ఆయన ఓకే అంటారా అన్నది తెలియాల్సి ఉంది. నిజంగా ఆర్.నారాయణ మూర్తి ఒకవేళ ఈ సినిమా చేస్తానని ఒప్పుకుంటే మాత్రం ఇక సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. తన పంథాలో తన సినిమాలు చేస్తూ వెళ్తున్న ఆర్.నారాయణ మూర్తి పీపుల్స్ స్టార్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించారు. ఐతే అంతకుముందు ఎన్ టీ ఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్ ఇచ్చి కోరినంత రెమ్యునరేషన్ ఇస్తానన్నా చేయన్న ఆయన నాని సినిమా చేస్తాడా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. మరి ప్యారడైజ్ టీం ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ ఇస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News