వైరల్ వీడియో : భార్య కోసం పాన్ ఇండియా స్టార్ పాట..!
రాధిక కోసం యశ్ పాడిన ఆ ప్రేమ పాట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధిక చిరు నవ్వు చిందిస్తూ యశ్ పాటను ఆస్వాదించడం సైతం వీడియోలో చూడవచ్చు.;
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్ హీరోగా నిలిచిన యశ్ ప్రస్తుతం 'టాక్సిక్' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. దాదాపు ఏడాది వెయిట్ చేసిన తర్వాత యశ్ టాక్సిక్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఎప్పుడు ఎప్పుడు ఈ సినిమా వస్తుందా అని యశ్ అభిమానులతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమాను చూసి యశ్‌కి ఫ్యాన్స్‌గా మారిన పాన్ ఇండియా ప్రేక్షకులు టాక్సిక్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇటీవల టాక్సిక్ సినిమా గురించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే తీసిన కొన్ని సీన్స్‌ను తొలగించి రీ షూట్ చేసేందుకు సిద్ధం అయ్యారంటూ పుకార్లు షికార్లు చేశాయి.
ఎప్పుడూ సినిమాలతో, ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో వార్తల్లో ఉండే కేజీఎఫ్ స్టార్ యశ్ ఈసారి ఒక వైరల్ వీడియోతో వార్తల్లో నిలిచాడు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో యశ్ పాట పాడాడు. ఆ పాట తన భార్య రాధిక గురించి కావడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం. సాధారణంగా హీరోలు భార్యల గురించి మాట్లాడితే, వారిపై ప్రేమను చూపించే విధంగా కామెంట్స్ చేస్తే వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. అలాంటిది యశ్ ఏకంగా పాట పాడి తన ప్రేమను చూపించడం ద్వారా వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. యశ్ పాడిన పాట గురించి ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా ఆయన ఫ్యాన్స్‌తో పాటు అంతా తెగ వెతికేస్తున్నారు.
రాధిక కోసం సాంప్రదాయ కన్నడ లవ్ సాంగ్ జోతే జోతేయాలిని యశ్ పాడటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. తన కోసం యశ్ పాడిన పాట వీడియోను రాధిక మురిసి పోతు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రాధిక కోసం యశ్ పాడిన ఆ ప్రేమ పాట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాధిక చిరు నవ్వు చిందిస్తూ యశ్ పాటను ఆస్వాదించడం సైతం వీడియోలో చూడవచ్చు. మొత్తానికి భార్య పై తనకు ఉన్న ప్రేమను సమయం వచ్చినప్పుడు, సందర్భానుసారంగా కనబర్చడం అనేది యశ్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటారు. అందుకే ఇద్దరు చాలా అన్యోన్యంగా జీవితాన్ని సాగిస్తున్నారు.
2016లో యశ్, రాధికల ప్రేమ వివాహం జరిగింది. నటిగా రాధిక మంచి పేరు సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో బిజీగా ఉన్న సమయంలోనే ఈ అమ్మడు పెళ్లి పీటలు ఎక్కింది. యశ్ తో పెళ్లి తర్వాత రాధిక ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ పిల్లలు పుట్టిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో రాధిక రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. మరి రాధిక రీ ఎంట్రీ ఇచ్చి, యశ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుందా అనేది చూడాలి.