ఎన్టీఆర్ కు తగ్గట్లే స్ట్రాంగ్ టైటిల్..

ఎన్టీఆర్ స్టైల్‌కి తగ్గట్లు, యాక్షన్ మాస్ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ‘ROCK’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయబోతున్నారని టాక్.;

Update: 2025-03-10 11:59 GMT

ఎన్టీఆర్ క్రేజ్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో గట్టిగానే వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వార్ 2తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న ఎన్టీఆర్, మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారు. కానీ మళ్ళీ మార్చే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

ఎందుకంటే ఇటీవల ప్రదీప్ రంగనాథ్ హీరోగా అదే పేరుతో సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మేకర్స్ మరొక ఆప్షన్ కోసం చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ఎన్టీఆర్ కోసం లైన్‌లోకి వచ్చింది. డాక్టర్, జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఎన్టీఆర్ కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట.

గత కొంతకాలంగా ఎన్టీఆర్ కోసం కథ రెడీ చేస్తున్న నెల్సన్, ఇప్పుడు దీనికి ఒక స్ట్రాంగ్ టైటిల్ కూడా పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ స్టైల్‌కి తగ్గట్లు, యాక్షన్ మాస్ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ‘ROCK’ అనే టైటిల్‌ను ఫైనల్ చేయబోతున్నారని టాక్. పాన్ ఇండియా లెవెల్‌లో ఏ సినిమాకైనా అందరికీ అర్థమయ్యే టైటిల్ పెట్టాలని దర్శకుడు అనుకుంటున్నాడు.

అందుకే, ఈసారి మాస్ అప్పీల్‌తో పాటు ఇంటెన్స్ అండర్‌టోన్స్ కలిగిన రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. నిర్మాత నాగ వంశీ ఇప్పటికే నెల్సన్‌తో ఈ సినిమాను త్వరగా సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నెల్సన్ సినిమాల ప్రత్యేకత ఏమిటంటే, ఆయన యాక్షన్ ఎంటర్టైనర్స్‌కు అద్భుతమైన హాస్యాన్ని మిక్స్ చేయడంలో ఎంతో స్పెషలిస్ట్.

జైలర్ లాంటి సినిమా కూడా సీరియస్ యాక్షన్ డ్రామా అయినప్పటికీ, రజినీకాంత్ స్టైల్‌లో కొన్ని ఫన్ మూమెంట్స్‌కి స్పేస్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం కూడా హై-ఆక్టేన్ యాక్షన్, మాస్ ఎంటర్టైనర్, రఫ్ క్యారెక్టర్‌తో కూడిన కథను డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, 2026లో నెల్సన్ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది చివర్లో ప్రీ-ప్రొడక్షన్ పూర్తయి, అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావొచ్చని టాక్. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. మొత్తానికి, ‘రాక్’ అనే టైటిల్ ఎన్టీఆర్ స్టైల్‌కి, ఆయన మాస్ ఇమేజ్‌కి పూర్తి స్థాయిలో న్యాయం చేసేలా ఉందనే చెప్పాలి.

Tags:    

Similar News