రాబిన్‌హుడ్‌ 'అదిదా సర్‌ప్రైజ్'.. గ్లామర్ తో హీటెక్కించిన కేతికా

మాస్ బీట్స్ తో సాగే లిరిక్స్, బీట్ లను తట్టుకునే విధంగా ఉంటేనే పాట హిట్ అవుతుంది. ఆ రకంగా చూస్తే ఈ సాంగ్ మాస్ కాంబోలా అనిపిస్తోంది.;

Update: 2025-03-10 13:13 GMT

యంగ్ హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ రాబిన్‌హుడ్ భారీ అంచనాల మధ్య మార్చి 28న థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా, తాజాగా కేతికా శర్మ స్పెషల్ సాంగ్ ‘ఆధి ధా సర్ప్రైసు’ లిరికల్ వీడియో వచ్చేసింది.

 

ఈ పాట ఇప్పుడు సినీ లవర్స్‌కి ఫుల్ మాస్ ఫీల్ కలిగిస్తూ వైరల్ అవుతోంది. పాట టైటిల్‌తోనే కాస్త ఆసక్తికరంగా అనిపించిన ఈ సాంగ్, లిరికల్ వీడియోతో మరింత హైప్ పెంచింది. కేతికా శర్మ గ్లామర్ ట్రీట్ ఈ పాటకు స్పెషల్ హైలైట్‌గా నిలిచింది. తెరపై ఆమె పర్ఫామెన్స్, డాన్స్ మూవ్స్, ఫైర్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నీ కలిపి మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. కేతికా ఒదిగిపోయిన డ్రెస్, చక్కని ఆభరణాలు, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు హాట్ టాపిక్‌గా మార్చేశారు.

మాస్ బీట్స్ తో సాగే లిరిక్స్, బీట్ లను తట్టుకునే విధంగా ఉంటేనే పాట హిట్ అవుతుంది. ఆ రకంగా చూస్తే ఈ సాంగ్ మాస్ కాంబోలా అనిపిస్తోంది. సాంగ్‌లో మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జీవీ ప్రకాష్ ఇచ్చిన బాణీలు వినసొంపుగా ఉండటమే కాకుండా మాస్ బీట్స్ మిక్స్ చేయడం వలన పాట మరింత క్లాసీగా అనిపిస్తోంది. లిరిక్స్ లో చూస్తే చంద్రబోస్ తన మార్క్ చూపించారు.

లిరిక్స్ మామూలుగా కాకుండా ఓ కొత్త ఫ్లేవర్‌తో సాంగ్‌ను తయారు చేసినట్లు అనిపిస్తోంది. పాడిన నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి డ్యూయెట్ ఎనర్జీని అందించగలిగారు. కేతికా శర్మ డాన్స్ మూమెంట్స్‌కి ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చిన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కూడా మరింత హైప్ తీసుకొచ్చింది. సెట్స్‌, లైట్ ఎఫెక్ట్స్ అన్నీ కలిపి ఈ పాట గ్రాండ్ విజువల్స్‌కి తక్కువేం కాదు. పాట చివర్లో స్రీలీల, నితిన్ కలిసి డాన్స్ చేయడం, సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాబిన్‌హుడ్ యాక్షన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించబోతోంది. సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేస్తున్నారు. కేతికా శర్మ స్పెషల్ సాంగ్ సినిమాకు మరో ప్లస్ అవుతుందా? లేదా? అన్నది తెలియాలంటే మార్చి 28 వరకు వెయిట్ చేయాల్సిందే. చూడాలి మరి బిగ్ స్క్రీన్ పై ఈ పాట ఎంతవరకు ఆకట్టుకుంటుందో.

Full View
Tags:    

Similar News