రాజాసాబ్‌ : నేను దెయ్యం కాదు, కానీ భయపడతారు!

నిధి ఇంకా మాట్లాడుతూ... రాజా సాబ్‌ సెట్‌ అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక అహ్లాదకరమైన వాతావరణం ఉన్న సెట్‌ను చూడలేదు.;

Update: 2025-03-10 19:30 GMT

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్‌ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడ్డా కూడా అంచనాలు మాత్రం తగ్గడం లేదు. అంచనాలు పెంచడం కోసం, వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ను మరింతగా క్వాలిటీగా తీసుకు రావడం కోసం దర్శకుడు మారుతి టైం తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయం పక్కన పెడితే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నిధి అగర్వాల్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రాజాసాబ్‌ సినిమాపై అంచనాలు పెంచుతూనే తన పాత్రను గురించి నిధి చెప్పుకొచ్చింది. తప్పకుండా ఇది ఒక మంచి సినిమాగా నిలుస్తుంది అనే నమ్మకంను ఆమె వ్యక్తం చేసింది.

పాన్ ఇండియా రేంజ్‌లో రాజాసాబ్‌ సినిమాను విడుదల చేయబోతున్నారు. హిందీలో భూషన్‌ కుమార్‌ భారీగా విడుదల చేసేందుకు గాను సిద్ధంగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ హర్రర్‌ కామెడీ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. మొదటగా మాళవిక మోహనన్‌ పాత్ర గురించి ప్రముఖంగా చర్చ జరిగింది. తాజాగా ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్‌ చేసిన వ్యాఖ్యలతో అంచనాలు అటువైపు షిప్ట్‌ అవుతున్నాయి. నిధి అగర్వాల్‌ మాట్లాడుతూ... అంతా భావిస్తున్నట్లుగానే ఇది ఒక మంచి హర్రర్‌ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఆసక్తికర సన్నివేశాలతో సాగుతుంది అని చెప్పుకొచ్చింది.

నిధి ఇంకా మాట్లాడుతూ... రాజా సాబ్‌ సెట్‌ అద్భుతంగా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఇలాంటి ఒక అహ్లాదకరమైన వాతావరణం ఉన్న సెట్‌ను చూడలేదు. ప్రభాస్ గారితో వర్క్ చేయడం అనేది జీవితం మొత్తానికి సరిపోయే అనుభవాలను, అనుభూతిని ఇస్తుంది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా స్పీట్‌ పర్సన్‌ అని నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తాను దెయ్యంగా కనిపించబోతున్నట్లు కొందరు భావిస్తున్నారు. తాను ఈ సినిమాలో దెయ్యం గా కనిపించబోవడం లేదు. అయితే తన పాత్ర కాస్త భయంకరంగా మాత్రం ఉంటుందని, తన పాత్ర సినిమాను చూసే ప్రేక్షకులను భయపెడుతుందని నిధి అగర్వాల్‌ చెప్పుకొచ్చింది.

గ్లామర్‌ పాత్రకు భిన్నంగా ఉండటంతో పాటు ప్రభాస్ మార్క్ సినిమా ఇది కావడంతో అందుకు తగ్గట్లుగానే డీసెంట్‌గా ఉంటుంది అంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిధి అగర్వాల్‌ మరో వైపు పవన్‌ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాలోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్‌ పోస్టర్‌లో నిధి అగర్వాల్‌ చాలా అందంగా కనిపించింది అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే రాజాసాబ్‌ సినిమాలోని నిధి అగర్వాల్‌ లుక్‌ మాత్రం ఇంకా రివీల్‌ కాలేదు. త్వరలోనే రాజాసాబ్‌ తన హీరోయిన్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడేమో చూడాలి. ఈ రెండు సినిమాలు కాకుండా తమిళ్‌ స్టార్‌ హీరో సూర్యతో నిధి అగర్వాల్‌ నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి.

Tags:    

Similar News