ఇంతగా ఆరబోస్తున్నా ఏదీ కలిసి రాదు!
ఇటీవల లవ్ యాపా చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ సోదరి ఖుషి కపూర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ఆశపడ్డారు. కానీ ఆ చిత్రం డిజాస్టరైంది.;
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెల తెరంగేట్రం అభిమానుల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే. జాన్వీకపూర్ ధడక్ చిత్రంతో తెరంగేట్రం చేసినప్పుడు చాలా చర్చ సాగింది. మామ్ శ్రీదేవితో పోల్చి చూశారు.
ఇటీవల లవ్ యాపా చిత్రంతో తెరంగేట్రం చేసిన జాన్వీ సోదరి ఖుషి కపూర్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలని ఆశపడ్డారు. కానీ ఆ చిత్రం డిజాస్టరైంది. ఇప్పుడు సైఫ్ ఖాన్ కొడుకుతో నటించిన సినిమా కూడా ఖుషీకి ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
వరుసగా రెండు ఫ్లాపులు ఈ అమ్మడిని డీలా పడేలా చేసాయి. అయితే సోషల్ మీడియాల్లో ఖుషీ ఇస్తున్న అందాల ట్రీట్ మామూలుగా లేదు. అభిమానులను నిరంతరం వేడెక్కించే ఫోజులతో రెచ్చగొడుతోంది. ఈ ఫోజులు చూశాక అందం ఉంది.. వేడి ఉంది.. కానీ అదృష్టం కలిసి రాలేదు! అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
వరుసగా రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. కనీసం ఖుషీ నటన బావుందని కూడా ఎవరూ చెప్పలేదు. దీంతో ఈ భామ బాగా డీలా పడినట్టే కనిపిస్తోంది. అయితే ఖుషీ పరిస్థితి ఎలా ఉన్నా, తన కెరీర్ ని జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టించడమెలానో, మార్కెట్లో విజయవంతమైన ఉత్పత్తిలా మార్చడం ఎలానో పాపా బోనీ కపూర్ కి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. అయితే ఖుషీ కనీసం నాలుగైదు సినిమాల తర్వాత అయినా తన ప్రతిభను నిరూపించాల్సి ఉంటుంది. తన సోదరి జాన్వీ కపూర్ ఆరంభం నెమ్మదిగా ఉన్నా, ఇటీవల పరిణతి చెందిన నట ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఖుషీ కూడా ఒక్కో మెట్టు ఎక్కాలి. ఈ నటవారసురాలి భవితవ్యం ఎలా ఉంటుందో వేచి చూడాలి.