ఫెయిల్ అయిన వారసులు... ఇలా అయితే కష్టమే!
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ హీరో హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం కొత్తేం కాదు. అయితే వారసుల్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది.;
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ హీరో హీరోయిన్స్‌గా ఎంట్రీ ఇవ్వడం కొత్తేం కాదు. అయితే వారసుల్లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. కొద్ది మంది మాత్రమే హీరో హీరోయిన్‌గా సక్సెస్ అవుతున్నారు. కొందరు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అక్కడ హిట్ రాకపోవడంతో కొన్నాళ్లు ప్రయత్నాలు చేసి కనుమరుగు అవుతున్నారు. కొందరు మాత్రం సక్సెస్‌ల కోసం ఏళ్లకు ఎళ్లు ఎదురు చూస్తున్నారు. ఇటీవల దివంగత అతిలోక సుందరి శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించినా ఖుషికి హిట్ పడటలేదు. వెబ్ సిరీస్‌లోనూ నటించి తన అదృష్టంను పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం దక్కలేదు.
తాజాగా ఖుషి కపూర్ 'నాదానియన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా నటించాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఇబ్రహీం అలీ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు నాదానియన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇబ్రహీంకి ఇది మొదటి సినిమా కాగా ఖుషి కపూర్ మాత్రం అప్పటికే రెండు మూడు సినిమాలు నటించి ఉంది. కానీ ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. ఇబ్రహీం అలీ ఖాన్‌తో పాటు ఖుషి కపూర్‌కి సైతం 'నాదానియన్' సినిమా హిట్ అత్యంత కీలకం. అందుకే కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి సినిమాను చేయడం జరిగింది.
షానా గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను నేరుగా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి మంచి పని చేశారు. ఈ సినిమాను థియేటర్‌లో ఎలా చూస్తారు జనాలు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. హీరోగా ఇబ్రహీం ఇంకా చాలా మెరుగు పడాలంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా అతడి నటనను చాలా మంది తండ్రి సైఫ్ అలీ ఖాన్ నటనతో పోల్చుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదెక్కడి విడ్డూరం అంటూ పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. నటనలో మినిమం ఓనమాలు కూడా నేర్చుకోలేదా అంటూ కొందరు పెదవి విరుస్తూ కామెంట్స్ చేశారు.
ఇక హీరోయిన్‌గా నటించిన ఖుషి కపూర్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న వారు ఉన్నారు. ఇబ్రహీం మొదటి సినిమా కనుక ఆయన తప్పులను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఖుషి కపూర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు మూడు సినిమాలు కూడా చేసింది. అయినా ఇప్పటి వరకు నటనలో మినిమం జ్ఞానం సంపాదించలేదు. అంతే కాకుండా ఖుషి స్క్రీన్ ప్రజెన్స్ అస్సలు బాగుండటం లేదు. అక్క జాన్వీ కపూర్‌తో పోల్చుతూ కొందరు ఖుషి కపూర్ అందంను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు వారసులు చాలా ఆశలు పెట్టుకుని చేసిన నాదానియన్ సినిమా నిరాశ పరచడంతో భవిష్యత్తు ఏంటో అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అయితే ఫ్యూచర్‌లో ఆఫర్లు రావడం కష్టమే, స్టార్ డం దక్కడం మరింత కష్టం అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.