RC16: బ్రేక్ లేకుండానే జెట్ స్పీడ్.. ఆ రేంజ్ మాసివ్ రోల్!

ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, "రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ నటన గురించి అదే స్థాయిలో చర్చించుకునేలా చేస్తుంది" అని సమాచారం.;

Update: 2025-03-10 09:55 GMT

రామ్ చరణ్ ప్రస్తుతం RC16 షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, స్పోర్ట్స్ డ్రామాగా భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ బ్రేక్ లేకుండా జరుగుతోంది. మిగిలిన సినిమాల్లా పెద్దగా బ్రేక్‌లు తీసుకోకుండా టీమ్ వీలైనంత త్వరగా షూట్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే షెడ్యూల్స్ అన్నీ హై స్పీడ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

ఇందులోని ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ సినిమా ఎక్కువగా VFX ఆధారంగా వెళ్లే సినిమా కాదు కనుక, అనవసరమైన డిలే లేకుండా సాధ్యమైనంత త్వరగా షూట్ పూర్తి చేసేందుకు ప్రొడక్షన్ టీమ్ సిద్ధమైంది. బుచ్చిబాబు ప్రత్యేకంగా సినిమా కథకు తగ్గట్లే వాతావరణాన్ని సహజంగా చిత్రీకరించేలా ప్లాన్ చేశారని, అందుకే స్టూడియో సెట్స్‌కు బదులుగా ప్రకృతి ఒడిలో ఎక్కువ భాగం షూటింగ్ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే, "రంగస్థలం తర్వాత మళ్లీ రామ్ చరణ్ నటన గురించి అదే స్థాయిలో చర్చించుకునేలా చేస్తుంది" అని సమాచారం. ఈ సినిమా లో చరణ్ పాత్ర ఎంతో ఎమోషనల్ డెప్త్‌తో కూడుకున్నదని టాక్. ఒక పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఇందులో హైలైట్ కానుందని, గేమ్ ఛేంజర్‌లోని చరణ్ ఫ్లాష్‌బ్యాక్ తరహాలోనే ఈ సినిమాకు కూడా ఒక మేజర్ హైలైట్ ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ వంటి రఫ్ అండ్ మాస్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. రామ్ చరణ్ ప్రత్యేకంగా ఫిజికల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఇందులో ఆయన పాత్ర పూర్తిగా మాస్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందని సమాచారం. మరోవైపు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతిబాబు వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ కాంబో కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.

ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ మ్యాజిక్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు తన నేటివిటీ స్టైల్ కథనాన్ని, రామ్ చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మిక్స్ చేసి, ఒక హై-ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామాను తెరపైకి తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కానుంది. అతి త్వరలోనే టీజర్, ఫస్ట్ లుక్ సంబంధిత అప్‌డేట్స్ వచ్చే అవకాశముంది.

Tags:    

Similar News