షో స్టాప‌ర్ సితార ఘ‌ట్ట‌మ‌నేని స్ట‌న్నింగ్ లుక్

తాజాగా న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోషూట్ నుంచి ప్రిన్సెస్ సితార స్మైలీ లుక్ అభిమానుల్లోకి దూసుకెళుతోంది.;

Update: 2025-03-10 07:57 GMT

ఫ్రేమ్‌లో ఎంద‌రు ఉన్నా సితార ఘ‌ట్ట‌మ‌నేని షో స్టాప‌ర్ అన‌డంలో సందేహం లేదు. మ‌హేష్ - న‌మ్ర‌త దంప‌తుల ఏకైక గారాల‌ప‌ట్టీ సితార అల్ట్రా స్టైలిష్ లుక్స్ వెబ్‌లో నిరంత‌రం హాట్ టాపిక్. తాజాగా న‌మ్ర‌త షేర్ చేసిన ఫోటోషూట్ నుంచి ప్రిన్సెస్ సితార స్మైలీ లుక్ అభిమానుల్లోకి దూసుకెళుతోంది.


నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి - కీర్తి వివాహం అబుదాబిలో జరిగింది. ఈ పెళ్లికి పెద్ద‌ సంఖ్యలో టాలీవుడ్ తారలు హాజరయ్యారు. నమ్రతా శిరోద్కర్ ఈ వివాహ వేడుకల నుండి ఆకర్షణీయమైన ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసారు. ఈ ఫోటోగ్రాఫ్ లో సితార ఘ‌ట్ట‌మ‌నేని ట్రెడిష‌నల్ లుక్‌లో ఎంతో అందంగా క‌నిపించారు. ఫ్రేమ్‌లో ఎంద‌రు ఉన్నా సితార యూనిక్ నెస్ ప్ర‌త్య‌క్షంగా ఎలివేట్ అవుతోంది.


ఇక ఇదే వేడుకలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన జంట ప్రత్యేక ఫోటో ఆన్‌లైన్‌లో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఉపాసన స్టైలిష్ లేత గోధుమరంగు ఎంబ్రాయిడరీ దుస్తుల్లో క‌నిపించ‌గా, రామ్ చరణ్ క్లాసిక్ సూట్‌లో స్మార్ట్ గా కనిపించారు. ఇదే వేడుక‌కు జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి దంప‌తులు కూడా హాజ‌ర‌య్యారు.


ఈవెంట్‌లో మహేష్ బాబు కుమార్తె సితార నేవీ బ్లూ షరారా దుస్తుల్లో అందంగా కనిపించగా, న‌మ్ర‌త ఎరుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో ట్రెడిష‌న‌ల్ గా క‌నిపించారు. ఈ ఫోటోల‌కు న‌మ్ర‌త అంద‌మైన క్యాప్ష‌న్ ని జోడించారు.


చివ‌రి రాత్రి.. అంతిమంగా నితీష్‌రెడ్డి- కీర్తి జంట‌కు జీవితాంతం ప్రేమ, ఆనందం కలగాలని కోరుకుంటున్నాను! అని తెలిపారు. అంతకుముందు నమ్రతా ప్రీ-వెడ్డింగ్ వేడుకల నుండి ఫోటోలను షేర్ చేసారు. ఇందులో చ‌ర‌ణ్- ఉపాస‌న దంప‌తులు స‌హా ఇతర ప్రముఖులు ఉన్నారు. సంగీతం, నృత్యంతో ఘ‌న‌మైన‌ వేడుకలో స్టార్ సెల‌బ్రిటీలు సంద‌డి చేసారు. ప్ర‌స్తుతం ఈ పెళ్లి వేడుక నుంచి త్రోబ్యాక్ ఫోటోలు ఇంట‌ర్నెట్ లోకి విడుద‌ల‌వుతున్నాయి. వాటిని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు.

Tags:    

Similar News