బిగ్ బాస్ నానికి ఎక్స్ పీరియన్స్ అయ్యిందిగా.. అయినా డేర్ చేస్తారా..?
బిగ్ బాస్ సీజన్ 9 కి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ టీం. ఐతే ఈసారి హోస్ట్ విషయంలో కచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు.;
బిగ్ బాస్ సీజన్ 9 కి సన్నాహాలు చేస్తున్నారు బిగ్ బాస్ టీం. ఐతే ఈసారి హోస్ట్ విషయంలో కచ్చితంగా మార్పు ఉంటుందని అంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తూ వచ్చారు. సీజన్ సీజన్ కి నాగార్జున హోస్టింగ్ అదిరిపోయింది. కేవలం నాగార్జున కోసమే షో చూసే వాళ్లు ఉన్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ని ఎన్టీఆర్ హోస్ట్ గా చేశాడు. అసలు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందో తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసింది ఆయనే.
ఐతే ఫస్ట్ సీజన్ కాగానే 3 నెలలు ఆ షోకి డేట్స్ ఇవ్వడం కష్టమని ఎన్టీఆర్ బిగ్ బాస్ ని వదిలేశాడు. ఐతే తారక్ తర్వాత బిగ్ బాస్ రెండో సీజన్ నాని హోస్ట్ గా చేశాడు. ఒక్క సీజన్ చేసే సరికి నానికి బిగ్ బాస్ షో మీద విరక్తి వచ్చేసింది. ఇక మీదట ఎప్పుడు ఆ షో వంక కూడా చూడకూడదని ఫిక్స్ అయ్యాడు. నానికి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది అంటే ఆ బిగ్ బాస్ హోస్ట్ చేయడం వల్లే.
ఎందుకంటే ఆ సీజన్ లో నాని కొంతమంది కంటెస్టెంట్స్ కి ఫేవర్ గా ఉన్నాడన్న టాక్ వచ్చింది. ఈ గోలంతా నాకెందుకు అని సైలెంట్ అయ్యాడు నాని. సీజన్ 3 నుంచి సీజన్ 8 వరకు నాగార్జున సింగిల్ హ్యాండ్ తో హోస్ట్ గా చేస్తూ వచ్చాడు. ఐతే ఇప్పుడు నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండని హోస్ట్ గా పెట్టబోతున్నారని టాక్. నాని ఎక్స్ పీరియన్స్ చూశాక కూడా విజయ్ దేవరకొండ ఆ రిస్క్ తీసుకుంటాడా అంటూ చర్చించుకుంటున్నారు.
నాని హోస్ట్ గా చేసిన టైం లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ నానిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అది తీవ్ర స్థాయికి చేరింది. నాని కూడా ఆ నెగిటివిటీ భరించలేకపోయాడు. మరి అది చూసి కూడా విజయ్ దేవరకొండ హోస్ట్ గా చేయాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. నాగార్జున బదులుగా విజయ్ దేవరకొండని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారు బిగ్ బాస్ టీం.
ఇక బిగ్ బాస్ హోస్ట్ గా చేసేందుకు ఈసారి హోస్ట్ కి భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నారని టాక్. దాదాపు 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి నాగార్జున కాకపోతే ఆ ప్లేస్ లో బిగ్ బాస్ హోస్ట్ ఎవరా అన్నది షో మొదలయ్యే దాకా క్లారిటీ కోసం వెయిట్ చేయాల్సిందే.