సలార్ 2 కి ప్లస్ అయ్యేలా SSMB29..!
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమా కాస్టింగ్ గురించి క్లారిటీ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టాడు మన జక్కన్న.;
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమా కాస్టింగ్ గురించి క్లారిటీ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టాడు మన జక్కన్న. సినిమాలో ఎవరు ఉన్నారు ఎవరు లేరన్నది తెలియదు. మహేష్ తో పాటుగా ప్రియాంక చోప్రా అయితే ఉందని తెలుసు. ఐతే ఈమధ్య మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారన్న వార్త వచ్చింది. ఆయన కూడా రీసెంట్ ఇంటర్వ్యూలో అవును కాదన్నట్టుగానే సమాధానం ఇచ్చారు.
ప్రస్తుతం ఒడిశా లో మహేష్ 29వ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో పృధ్వి రాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నాడు అని గట్టిగానే చెబుతున్నారు. ఎందుకంటే ఈమధ్య మహేష్ కనిపించిన కొద్దిసేపటికే ఎయిర్ పోర్ట్ లో పృధ్విరాజ్ కూడా కనిపించాడు. ఇద్దరు రాజమౌళి సినిమా షూటింగ్ కోసమే అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. ఐతే మహేష్ తో పృధ్విరాజ్ సుకుమారన్ చేస్తున్న ఈ సినిమా ఎలా లేదన్నా రెండేళ్లు పడుతుంది.
ఈ సినిమా తర్వాత ప్రభాస్ తో సలార్ 2 ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సో మహేష్ సినిమాతో పృధ్విరాజ్ మరింత క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ రాబోతున్న సలార్ 2 కి అది కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. సలార్ 2 లో వరద రాజ మన్నార్ గా తన విలనిజం చూపించబోతున్నాడు పృధ్విరాజ్. అసలు సినిమా సెకండ్ పార్ట్ లోనే ఉందని ప్రశాంత్ నీల్ బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు.
సో ఈలోగా మహేష్ సినిమాతో పృధ్వి రాజ్ కు గ్లోబల్ వైడ్ గా స్పెషల్ క్రేజ్ వస్తుంది. సో అది సలార్ 2 కి కచ్చితంగా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా రెండు భాగాలుగా ఉంటుందని తెలుస్తుంది. ఎన్ టీ ఆర్ సినిమా మొదటి భాగం పూర్తి చేశాక సలార్ 2 సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. ఈలోగా ఎస్.ఎస్.ఎం.బి 29 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా చూసినా సరే మహేష్ సినిమా ద్వారా ప్రభాస్ సలార్ 2 కి ప్లస్ అయ్యేలానే ఉంది. మహేష్ రాజమౌళి సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందని తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబో కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇవ్వనుంది.