స్టార్ కిడ్ కి టాలీవుడ్ లాంచింగ్ సంతోష‌మేనా?

అటుపై అమ్మ‌డి బాలీవుడ్ కెరీర్ తిరుగు లేకుండా సాగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. కానీ సోనాక్షి మాత్రం ఇండ‌స్ట్రీలో న‌టిగా బ‌ల‌మైన ముద్ర మాత్రం వేయ‌లేక‌పోయింది.;

Update: 2025-03-09 18:30 GMT

బాలీవుడ్ న‌టుడు శ‌త్రుజ్ఞు సిన్హా వార‌సురాలిగా సోనాక్షి సిన్హా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా `ద‌బాంగ్` తో మంచి విజ‌యం అందుకుంది. అటుపై అమ్మ‌డి బాలీవుడ్ కెరీర్ తిరుగు లేకుండా సాగిపోతుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. కానీ సోనాక్షి మాత్రం ఇండ‌స్ట్రీలో న‌టిగా బ‌ల‌మైన ముద్ర మాత్రం వేయ‌లేక‌పోయింది.

త‌న‌క‌న్నా వెన‌కొచ్చిన వారంతా జాతీయ అవార్డులు అందుకున్నారు. న‌టిగా ప్ర‌త్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. సోలోగా బాక్సాపీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నారు. అలియాభ‌ట్, కృతిస‌న‌న్, కియారా అద్వాణీ లాంటి వారు ఎంత‌గా ఫేమ‌స్ అయ్యారు? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ సోనాక్షి మాత్రం వాళ్ల‌లో ఫేమ‌స్ కాలేక‌పోయింది. ప్ర‌తిభావంతురాలైనా? అమ్మ‌డికి ఆవ‌గింజంత అదృష్టం రాకపోవ‌డం అన్న‌ది శోచ‌నీయం.

ఇక వ్య‌క్తిగ‌త జీవితంలో సోనాక్షి రైట‌ర్ జ‌హీర్ ఇక్బాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ధాంప‌త్య జీవితంలో సంతోషంగా ఉంటుంది. బాలీవుడ్ లో ఒక‌టి రెండు సినిమాలు కూడా చేస్తుంది. కానీ సోనాక్షికి బ్యాకప్ కి ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. ఆ సంగ‌తి ప‌క్క‌న బెడితే తాజాగా సోనాక్షి టాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న `జ‌ఠాధ‌ర` లో న‌టిస్తోంది.

ఇందులో ఓ శ‌క్తివంత‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది. దీంతో సోనాక్షి సినిమాల ప‌ట్ల ఫ్యాష‌న్, త‌న‌లో డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ బ‌య‌ట ప‌డుతుంది. సాధార‌ణంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అంటే? అదే రేంజ్ ఉన్న సినిమాలు ఎంచుకుంటారు. భారీ కాన్వాస్...భారీ బ‌డ్జెట్ అంటూ వంద ర‌కాల ఆలోచ‌న‌లతో ఉంటారు. కానీ సోనాక్షి అలాంటి వారికి భిన్న‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో సోనాక్షి సిన్హా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన `లింగ` సినిమాలో భార్య పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రి మ‌ధ్య వ‌య‌సు వ్య‌త్యాసం ఉన్నా? ఆ పాత్ర‌కు సోనాక్షి ప‌ర్పెక్ట్ గా సూట‌వ్వ‌డంతోనే ఆ ఛాన్స్ తీసుకుంది.

Tags:    

Similar News