ప్రభాస్ నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ తెలిస్తే షాకింగే
బాహుబలిలో వారియర్ కింగ్ పాత్రలో అద్భుతంగా నటించాడు ప్రభాస్. 6.2 అడుగుల కటౌట్‌తో అతడు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రారాజు అంటే ఇలా ఉండాలి.;
బాహుబలిలో వారియర్ కింగ్ పాత్రలో అద్భుతంగా నటించాడు ప్రభాస్. 6.2 అడుగుల కటౌట్‌తో అతడు చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. రారాజు అంటే ఇలా ఉండాలి. వారియర్ అంటే ఈ స్టైల్లో విరుచుకుపడాలి అని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు మనస్ఫూర్తిగా అతడిని అభినందించారు. బాహుబలి ప్రభావం ఆ తర్వాత ప్రభాస్ కెరీర్ ఆద్యంతం కనిపించింది. ఒక పౌరాణిక జానపద కథను, ఇతిహాసాన్ని ముందుకు నడిపించే సత్తా డార్లింగ్ ప్రభాస్ కి ఉందని నిరూపణ అయింది. సూపర్ హీరో క్వాలిటీస్ ప్రభాస్ లో పుష్కలంగా ఉన్నాయని నిరూపణ అయ్యాక, లార్జర్ దేన్ లైఫ్ పాత్రల్లో అతడి సాహసాలకు అడ్డూ ఆపూ లేదు. `సాహో`తో అతడు భారీ ప్రయోగం చేసాడు. ఈ యాక్షన్ అడ్వెంచర్‌లో సూపర్ హీరోగా అతడి నటనకు జనం నీరాజనాలు పలికారు. నెగెటివ్ టాక్ వచ్చినా `సాహో` ఓపెనింగ్స్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచాయి.
బాహుబలి ఒక ఇతిహాస కథగా అతడిని అద్భుతంగా ఆవిష్కరించగా, మాఫియా కథతో సాహో మరో భిన్నమైన ప్రయత్నం. ఇదిలా ఉండగానే ఓంరౌత్ తో ఆదిపురుష్ లాంటి మరో సాహసం చేసాడు. కానీ దర్శకుడి అభిరుచి నాశిరకం ఆలోచనలు ప్రభాస్ విజన్ ని దెబ్బ తీసాయి. అయినా ప్రభాస్ కటౌట్ నటనకు ఎప్పుడూ వంకలు పెట్టలేదు జనం. ప్రశాంత్ నీల్ `సలార్`లో ప్రభాస్ యాక్షన్ మోడ్ పీక్స్ ని టచ్ చేసింది. వరుస సినిమాల్లో అతడు సూపర్ పాన్ ఇండియన్ స్టార్ డమ్ ఎలా ఉంటుందో చూపించాడు.
ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రధాన పౌరాణిక కథలు.. అడ్వెంచర్ థ్రిల్లర్ లకు ప్రభాస్ కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడని చర్చ సాగుతోంది. అతడు రోజు రోజుకు షైన్ అవుతున్నాడు. తన స్థాయిని పెంచుకునే ప్రాజెక్టుల కోసం మంతనాలు సాగిస్తున్నాడు. ప్రభాస్ తో `సలార్` లాంటి మ్యాసివ్ యాక్షన్ సినిమాని రూపొందించిన ప్రశాంత్ నీల్ తదుపరి ప్రభాస్‌తో కలిసి ఒక ఇతిహాస పౌరాణిక సినిమాకి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థలలో ఒకటి ప్రభాస్ ప్రధాన పాత్రలో అతి భారీ పౌరాణిక చిత్రం తెరకెక్కించేందుకు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
భారీ కాన్వాస్‌తో బిగ్ స్కేల్ పౌరాణికాలు, అడ్వెంచర్ థ్రిల్లర్ల కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నాడు. అతడు ఇండియాలో బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అనడంలో సందేహం లేదు. దీనిని తోపులం అని చెప్పుకునే ఖాన్ ల త్రయం కూడా అంగీకరించేందుకు వెనకాడటం లేదు. మునుముందు సలార్ 2 తో పాటు బ్యాక్ టు బ్యాక్ పౌరాణిక చిత్రాలతో ప్రభాస్ తన స్టార్ డమ్ ని మరో లెవల్ కి తీసుకెళతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు. అతడు నటించిన రాజా సాబ్ త్వరలో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అతడి స్థాయిని పెంచే సినిమాలుగా ప్రచారం ఉంది.