అవార్డుల్లో హంసలా మెరిసిన‌ కృతి

Update: 2025-03-09 07:36 GMT

ప్ర‌తిష్ఠాత్మ‌క ఐఫా డిజిటల్ అవార్డ్స్ -2025 వేడుకలు జైపూర్‌లో కన్నుల పండుగ‌గా సాగాయి. డిజిట‌ల్ స్ట్రీమింగ్ లో ఉత్త‌మ‌మైన సినిమాలు, సిరీస్ ల‌ను పుర‌స్కారాలు వ‌రించాయి. ఉత్త‌మ న‌టిగా 'దోప‌ట్టీ' కోసం కృతి స‌నోన్ ఐఫా పుర‌స్కారాన్ని గెలుచుకుంది. ఈ సినిమాతో కృతి స‌నోన్ నిర్మాత‌గాను ఆరంగేట్రం చేసింది. ఆ ఆనందం ఆవ‌ర్ణం అయిన వేళ కృతి స‌నోన్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది.

 

కృతి ఈ అవార్డుల కార్య‌క్ర‌మంలో మెరుపులా క‌నిపించింది. 'వైట్ అండ్ వైట్'లో రాణీ హంస‌లా మెరిసిపోయిన కృతి ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ గా మారాయి. ముఖ్యంగా కృతి అవార్డ్స్ నైట్‌లో షో స్టాప‌ర్ గా నిలిచింది. అవార్డ్ గెలుచుకున్న సంద‌ర్భంగా కృతి త‌న ఆనందాన్ని అస్స‌లు దాచుకోలేక‌పోయింది.

 

నా మొదటి ప్రొడక్షన్ #దోప‌ట్టీకి 'ఐఫా ఫ‌స్ట్ డిజిట‌ల్'లో ఉత్తమ నటిగా మొద‌టి అవార్డును అందుకున్నానని కృతి మురిసిపోయింది. దో ప‌ట్టీకి రెండు పెద్ద విజయాలు. నా భాగస్వామి క‌నికాథిల్లాన్ (ఉత్త‌మ క‌థార‌చ‌యిత‌) కి అభినందనలు !! బెస్ట్ స్టోరి.. బెస్ట్ యాక్ట‌ర్ అవార్డులు ద‌క్కాయి! అని కృతి తెలిపింది. ఐఫాకు, ప్రేక్షకులందరి ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు! అని ఆనందం వ్య‌క్తం చేసింది. ఈ గొప్ప క్షణం కోసం త‌న‌ను వేదిక‌పై ఉత్తమంగా కనిపించేలా చేసినందుకు త‌న బృందానికి అభినందనలు! తెలిపింది. త‌న కాస్ట్యూమ్స్- మేక‌ప్ టీమ్ ని మ‌రువకుండా ధ‌న్య‌వాదాలు తెలిపింది.

 

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. కృతి సనన్ చివరిసారిగా నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ దో పట్టిలో కనిపించింది. శశాంక చతుర్వేది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజోల్, షహీర్ షేక్ కూడా కీలక పాత్రల్లో నటించారు. క‌రీనా, ట‌బుల‌తో క‌లిసి న‌టించిన 'క్రూ' చిత్రంతో క‌మ‌ర్షియ‌ల్ విజయం అందుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ప్ర‌ముఖ బిజినెస్ మేన్ వార‌సుడితో కృతి షికార్లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

Tags:    

Similar News