త‌న‌కంటే 20 ఏళ్లు చిన్న‌వాడితో స్టార్ హీరోయిన్ ఎఫైర్?

అయితే, అమీషా తన చిత్రాలతో పాటు ఎఫైర్ ల‌తోను నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది.

Update: 2024-11-16 19:30 GMT

ప‌వన్ క‌ల్యాణ్ స‌ర‌స‌న బ‌ద్రి చిత్రంలో న‌టించింది అమీషా ప‌టేల్. ఆరంగేట్ర‌మే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ప‌వ‌న్ సినిమాలో త‌న‌దైన గ్లామ‌ర్ తో మురిపించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత మ‌హేష్, ఎన్బీకే లాంటి అగ్ర‌ హీరోల స‌ర‌స‌న న‌టించింది. బాలీవుడ్ లో హృతిక్ స‌ర‌స‌న `కహోనా ప్యార్ హై` చిత్రంతో ఆరంగేట్రం చేసింది. 2000లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించింది. హిందీ చిత్ర‌సీమ‌లో గదర్: ఏక్ ప్రేమ్ కథ, జమీర్: ది ఫైర్ వితిన్, యే హై జల్వా వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లలో నటించింది. అయితే, అమీషా తన చిత్రాలతో పాటు ఎఫైర్ ల‌తోను నిరంత‌రం వార్త‌ల్లో నిలిచింది.


49 సంవత్సరాల వయస్సులో పారిశ్రామిక‌వేత్త నిర్వాన్ బిర్లాతో రొమాన్స్ చేస్తోందంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. నిర్వాన్ బిర్లా పారిశ్రామికవేత్తలు యశోవర్ధన్ బిర్లా - అవంతి బిర్లాల కుమారుడు. అతడు కూడా పారిశ్రామికవేత్త.. గాయకుడు కూడా.. ఆస‌క్తిక‌రంగా త‌న కంటే 20 ఏళ్ల చిన్న‌వాడితో అమీషా ఇప్పుడు ప్రేమ‌లో ప‌డింద‌ని హిందీ మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. నిజానికి ఎఫైర్లు అమీషాకు కొత్తేమీ కాదు. అమీషా కెరీర్ తొలినాళ్ల‌లో పెళ్ల‌యిన బిజినెస్ మ్యాగ్నెట్ల‌తో రిలేష‌న్ లో ఉంద‌న్న ప్ర‌చారం ఉంది. తనకంటే ఎనిమిదేళ్లు పెద్దవాడైన విక్రమ్ భట్ తో అమీషా పటేల్ ఎఫైర్ నడిపించింద‌ని ప్ర‌చారం సాగింది. ఐదు సంవత్సరాల పాటు ఆ ఇద్ద‌రిపై పుకార్లు కొన‌సాగాయి. కానీ చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత ఒక ఇంటర్వ్యూలో విక్రమ్‌తో డేటింగ్ చేయడం తన జీవితంలో అతిపెద్ద తప్పులలో ఒకటి అని ఒప్పుకుంది.

లండన్‌కు చెందిన వ్యాపారవేత్త కనవ్ పూరితో అమీషా పటేల్ సంబంధం 2008లో ప్రారంభమైనట్లు క‌థ‌నాలొచ్చాయి. అయితే, అమీషా తన కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకోవడంతో రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. తరువాత అమీషా వ్యాపారవేత్త ఐపిఎల్ జట్టు యజమాని అయిన నెస్ వాడియాతో ఎఫైర్ మొద‌లు పెట్టిందంటూ ప్ర‌చారం సాగింది. అత‌డు చిన్న‌ప్ప‌టి నుంచి త‌న‌పై క్ర‌ష్ ఉంద‌ని చెప్పాడు. బొంబాయిలోని వ్యాయామశాలలో ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ప్రేమ చిగురించింది. నెస్ అమీషాకు అనేక బహుమతులు కూడా పంపారు. అయితే అమీషా తన కెరీర్‌లో మళ్లీ మొదటి స్థానానికి ఎద‌గాల‌ని భావించ‌డంతో ఈ సంబంధం ముగిసింది. అమీషా పటేల్ నిర్మాత కం వ్యాపార భాగస్వామి కునాల్ గూమర్‌తో స్వల్పకాలిక సంబంధం కలిగి ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమీషా తన బాయ్‌ఫ్రెండ్, కునాల్ అతని భార్య షామ్లీ ఉన్న ఒకే ఇంట్లో నివసించేదని కొన్ని క‌థ‌నాలొచ్చాయి. అయితే నిర్మాతతో తనకున్న సంబంధంపై అమీషా ఎప్పుడూ వ్యాఖ్యానించలేదు.

అమీషా పటేల్ కొత్త బోయ్ ఫ్రెండ్ నిర్వాన్ పటేల్ బిర్లా. వ్యాపారవేత్త నిర్వాన్ బిర్లాతో స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. నిర్వాణ్ చేతుల్లో స‌న్నిహితంగా ఒదిగిపోయి కనిపించింది అమీషా. ఇది సహజంగానే వారి రిలేషన్ గురించిన‌ ఉత్సుకతకు దారితీసింది. ఫోటోలో నిర్వాణ్ ఒడిలో అమీషా కూర్చోవడమే కాకుండా ఇద్ద‌రూ ప్రేమ‌జంట‌లా వామ్ గా క‌నిపించారు. ఈ జంట‌ దుబాయ్‌లో ఉన్నార‌ని క్యాప్ష‌న్ రివీల్ చేసింది. అమీషా క్యాప్షన్‌లో హార్ట్ ఎమోజీలు కూడా ఉన్నాయి. నిర్వాన్ వ్యాఖ్యల‌ విభాగంలో ``చాలా సరదాగా! నిన్ను ప్రేమిస్తున్నాను`` అంటూ నీలి హృదయంతో ప్రతిస్పందించాడు.

Tags:    

Similar News