అరువు గొంతు కాదు అసలు గొంతే!
ముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో మళ్లీ అవకాశాలతో బిజీ అవుతోంది.;
ముంబై బ్యూటీ పూజాహెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో మళ్లీ అవకాశాలతో బిజీ అవుతోంది. కోలీవుడ్ , టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం సూర్యతో `రెట్రో`, విజయ్ 69వ చిత్రం `జన నాయగన్`, `కాంచన-4`లో నటిస్తోంది. అలాగూ `కూలీ` చిత్రంలో ఐటం భామగాను అలరించబోతుంది. ఇవన్నీ సక్సెస్ అయితే పూజాహెగ్డేకి తిరుగుండదు.
మళ్లీ మునుపటిలా బిజీ అయిపోతుంది. సక్సెస్ కోసం అమ్మడు చేతిలో ఉన్న ఏ ఒక్క అవకాశం వదులు కోవడం లేదు. నిరంతర శ్రమ జీవిగా మారుతుంది. ఇంత వరకూ డబ్బింగ్ విషయంలో ఇతర ఆర్టిస్టులపై ఆధారపడిన అమ్మడు తొలిసారి సొంత గాత్రం వినిపించడానికి రెడీ అవుతోంది. `రెట్రో` సినిమా కోసం తానే స్వయంగా డబ్బింగ్ చెబుతుందిట. దీనిలో భాగంగా అమ్మడు ట్రైనర్ సమక్షంలో తమిళ్ నేర్చుకుంటుంది.
ఇతర సినిమా షూటింగ్ లలో పాల్గొంటూనే ఖాళీ సమయంలో తమిళ్ ప్రాక్టీస్ పై దృష్టి పెడుతుంది. ట్రైనింగ్ సహా భాషపై పట్టు రాగానే పూజాహెగ్డే డబ్బింగ్ పనులు మొదలు పెడుతుందని సమాచారం. `రెట్రో` కి డబ్బింగ్ సెట్ అయితే గనుక లైన్ లో ఉన్న మిగతా చిత్రాలకు తానే డబ్బింగ్ చెప్పే అవకా శాలున్నాయి. డబ్బింగ్ చెప్పడం పై పూజాహెగ్డే సంతోషాన్ని వ్యక్తం చేసింది.
తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల చిత్రాల్లో కూడా తానే స్వయంగా డబ్బింగ్ చెబుతానని తెలిపింది. కీర్తి సురేష్, రష్మికా మందన్నా లాంటి వారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ప్రోఫెషనల్ గా వాళ్లకు ఎంతో కలిసొచ్చింది. వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పడంతో తెరపై పాత్రలు పండటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఆ విషయంలో పూజాహెగ్డే కాస్త ఆలస్యం చేసింది.