తల తీసేసినట్లు అయిందన్న నిర్మాత!
దత్ గారి కాళ్ల మీద పడాల్సినంత అవసరం బిగ్ బీ కి ఏముందని సైతం రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి.
ముంబైలో జరిగిన 'కల్కి 2898' ఈవెంట్ లో భాగంగా బిగ్ బీ అమితాచ్చన్ తెలుగు నిర్మాత అశ్వినీదత్ కాళ్లకు నమస్కారం చేసిన ఘటన ఎంత సంచలనమైందో తెలిసిందే. లెజెండరీ నటుడు దత్ గారి కాళ్లకు నమస్కరించడం ఏంటి? అని అంతా చర్చించుకున్నారు. అంత పెద్ద నటుడు ఆయన కాళ్లకు నమస్క రించడం ఏంటని బిగ్ బీ అభిమానుల్లో పెద్ద చర్చే సాగింది. అసలు వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? దత్ గారి కాళ్ల మీద పడాల్సినంత అవసరం బిగ్ బీ కి ఏముందని సైతం రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి.
ఇద్దరు స్నేహితులు కాదు. కల్కి వరకూ కలిసి పనిచేసింది లేదు. ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా భారీగా ఉంది. అశ్వీనిదత్ వయసు 73 కాగా, అమితాబ్ వయసు 81 సంవత్సరాలు. అంటే దత్ కన్నా అమితాబ్ ఎనిమిదేళ్లు పెద్ద. సాధారణంగా వయసులో పెద్ద వారి కాళ్లకు నమస్క రించడంలో తప్పులేదు. వాళ్ల అశీర్వాదాలు తీసుకొచ్చు. కానీ ఇక్కడ అలా కూడా సరితూగ లేదు. అమితాబ్ కన్నా ఎనిమిదేళ్లు చిన్న వయసున్న దత్ గారి కాళ్లకు నమస్కరించడం మరింత అర్దం కానీ విషయం.
పోనీ అమితాబ్ కి దత్ గారు ఏ దశలోనైనా గురువు పాత్ర పోషించారా? అంటే అదీ లేదు. నటుడిగా అమితాబ్ ప్రయాణం 1969 లో మొదలవ్వగా, నిర్మాతగా అశ్వినీదత్ జర్నీ 1975 లో ప్రారంభమైంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నిర్మాతగా దత్ ఎనలేని సేవలందించిన మాట వాస్తవం. అలాగే బాలీవుడ్ పరిశ్రమకు అంతకు మించి కీర్తిని తీసుకురావడంలో అమితాబ్ పాత్ర ఎంతో గొప్పది.
అలాంటి ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఆ సన్నివేశానికి అసలు కారణం ఏమై ఉంటుందో? అయితే అమితాబ్ ఇలా చేయడం పట్ల అశ్వనీదత్ కూడా చాలా అసౌకర్యానికి గురైటనట్లు తాజాగా ఓ ఇంట ర్వ్యూలో రివీల్ చేసారు. అమితాబ్ ఓ లెజెండ్. సెట్ లో కనిపించినప్పుడు పరస్పరం నమస్కరించు కునే వాళ్లం. అలాంటి లెజెండరీ నటుడు నా కాళ్లకు నమస్కరించడం తో తల తీసేసినట్లు అయింది. ఆయనలా చేస్తారని అస్సలు ఊహించలేదు` అని అన్నారు.