పెద్ద ఆఫర్‌ మిస్ చేసుకున్న అనన్య పాండే..!

బాలీవుడ్‌ స్టార్‌ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది.

Update: 2025-02-11 10:30 GMT

బాలీవుడ్‌ స్టార్‌ చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఇప్పటి వరకు సాలిడ్ సక్సెస్‌ దక్కలేదు. టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండతో కలిసి ఈమె పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో చేసిన 'లైగర్‌' సినిమా నిరాశ పరచింది. బాలీవుడ్‌లోనూ లైగర్‌తో మంచి గుర్తింపు వస్తుందని ఆశ పడ్డ అనన్య పాండేకు నిరాశ మిగిలింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లైగర్‌ సినిమాలోతా ను ఇష్టం లేకుండానే చేశాను అంది. తన తండ్రి చుంకీ పాండే తనను కన్విన్స్ చేయడం వల్ల చేశాను అని, తాను ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనుకుంటాను అని అనన్య చెప్పుకొచ్చింది.

అనన్య పాండే ఒక పెద్ద సినిమా కోసం ఎదురు చూస్తుంది. స్టార్‌ దర్శకుడితో కలిసి వర్క్ చేయాలని ఆశగా ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అప్పటికే మరో సినిమాను కమిట్‌ కావడంతో అనన్య పాండే దర్శకుడు ఇంతియాజ్ అడిగిన డేట్లను ఇచ్చే పరిస్థితి లేదు. అనన్య పాండే డేట్లు సర్దుబాటు చేయలేక పోతున్న నేపథ్యంలో మరో హీరోయిన్‌తో సినిమాను చేసేందుకు గాను దర్శకుడు రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో ఇంతియాజ్ మరో హీరోయిన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాడు.

లైగర్‌ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న అనన్య పాండే ఇటీవల వరుసగా సినిమాల్లో నటిస్తోంది. పాత్రలను గురించి పెద్దగా పట్టించుకోకుండా వచ్చిన ఆఫర్‌లను సద్వినియోగం చేసుకునే ఉద్దేశంతో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు కార్తీక్‌ ఆర్యన్‌ తో కలిసి ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి కావడానికి సమయం పడుతుంది. అప్పటి వరకు ఇంతియాజ్ తన సినిమాను వెయిటింగ్‌లో పెట్టలేనని అన్నాడట. అందుకే సినిమాను ఇష్టం లేకుండానే అనన్య వదిలేసిందని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ సినిమా కోసం ముద్దుగుమ్మ అనన్య పాండే ఎక్కువ డేట్లను ఇవ్వడం వల్ల ఇంతియాజ్ సినిమా కమిట్‌ కాలేక పోయిందట.

విభిన్న చిత్రాలను రూపొందించి బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్స్‌ను అందుకున్న ఇంతియాజ్‌ అలీ వంటి స్టార్‌ దర్శకుడి సినిమాను మిస్‌ చేసుకోవడం అనేది కచ్చితంగా చాలా పెద్ద డ్యామేజ్. ఆయన సినిమాలు ఎన్నో బాలీవుడ్‌ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆయన దర్శకత్వంలో నటిస్తే మినిమం గ్యారెంటీ సక్సెస్‌ అనే అభిప్రాయం ఉంటుంది. అలాంటి దర్శకుడి దర్శకత్వంలో అనన్య పాండే ఈ సమయంలో నటించాల్సిన అవసరం ఉంది. కానీ ఆమె ఇప్పుడు సినిమాలో డేట్స్‌ లేని కారణంగా నో చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రాజెక్ట్‌ ఆలస్యం అయితే అనన్యకి ఛాన్స్ ఏమైనా దక్కేనా చూడాలి.

Tags:    

Similar News