సినిమా ఈవెంట్లు ఏపీలో మరింత ముమ్మరంగా!
ఒకప్పుడు సినిమాకి సంబంధించిన ఈవెంట్లు అంటే? కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరిగేవి. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఇలా ఏ వేడుకైనా హైదరాబాద్ హబ్ గా జరిగేది
ఒకప్పుడు సినిమాకి సంబంధించిన ఈవెంట్లు అంటే? కేవలం హైదరాబాద్ లో మాత్రమే జరిగేవి. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఇలా ఏ వేడుకైనా హైదరాబాద్ హబ్ గా జరిగేది. కానీ నేడు టాలీవుడ్ పాన్ ఇండియాకి రీచ్ అవ్వడంతో? సినిమా ప్రచారం కూడా విస్తరించింది. భాగ్యనగరం దాటి దేశ, విదేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రచారాన్ని వివిధ దేశాల్లో.. రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగుళూరు, లక్నో, అమెరికా, రష్యా, జపాన్, దుబాయ్, మలేషియా అంటూ భాగ్యనగరం దాటి పోతుంది.
పాన్ ఇండియాలో సినిమాలు చేస్తే దాదాపు దేశంలో అన్ని మేజర్ మెట్రో పాలిటన్ నగరాల్ని టార్గెట్ చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక `పుష్ప` లాంటి మాస్ కంటెంట్ ని అయితే ఏకంగా మాస్ ఆడియన్స్ లోకి తీసుకెళ్లేలా బీహార్ కూడా వెళ్లి ప్రచారం చేసారు. సాధారణంగా సినిమా ప్రచారానికి క్లాసీ సిటీల్నే ఎంచుకుంటారు. అక్కడ అన్ని రకాల వసుతులుంటాయి. ఇబ్బంది తలెత్తదు కాబట్టి అలాంటి నగరాలకే ప్రాధాన్యత ఇస్తారు.
కానీ ఆ రకమైన సౌకర్యం కంటే? జనాల్లోకి సినిమా వెళ్లడం ముఖ్యమంటూ తిష్ట వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. ఉత్తారాది రాష్ట్రాలపై ఫోకస్ చేయడంతో హైదరాబాద్ లో ఈవెంట్లు నిర్వహించడం అన్నది మునుపటి కంటే కాస్త తగ్గింది. సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కచ్చితంగా ఒకటి నిర్వహించేలా చూసుకుంటున్నారు. మిగతా ఈవెంట్లు వివిధ ప్రాంతాల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.
ముఖ్యంగా ఏపీ సపరేట్ అయిన నేపథ్యంలో విజయవాడ, వైజాగ్ లో కూడా ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. షూటింగ్ లతో పాటు ఈవెంట్ల పరిమితిని పెంచుతున్నారు. కోలీవుడ్ హీరోలు కూడా ప్రత్యేకంగా వైజాగ్ వచ్చి తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో? మునుపటి కంటే ఏపీలో ఈవెంట్లు మరింత ఎక్కువగా నిర్వహించేలా చర్యలకు సిద్దమవుతున్నట్లు వినిపిస్తుంది. అలా నిర్వహించడం అన్నది ఏపీకి కాస్త బూస్టింగ్ ఇచ్చినట్లు గా కూడా ఉంటుందని భావిస్తున్నారుట. మరి ఇది జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి.