నాకు 40 ఏళ్లు... ఇప్పుడు ఆ ఆసక్తి లేదు!
తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం ఇచ్చింది.
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఆండ్రియా జెరోమియా తాజాగా తెలుగులో సైంధవ్ సినిమాలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్న ఆండ్రియా సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన అందాల ఆరబోత ఫోటోలతో వైరల్ అవుతూ ఉంటుంది.
తాజాగా ఈ అమ్మడు ఒక ఇంటర్వ్యూలో పెళ్లి విషయమై ప్రశ్నించిన సమయంలో ఆసక్తికర సమాధానం ఇచ్చింది. పెళ్లి ఎప్పుడు అంటూ ఆండ్రియాను ప్రశ్నించగా గతంలో తాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. 25 ఏళ్ల వయసు లో పెళ్లి గురించి ఆలోచన వచ్చింది.
ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేక పోయాను. ఇప్పుడు నా వయసు 40 ఏళ్లు. ఇప్పుడు నాకు పెళ్లి పై ఆసక్తి లేదు. భవిష్యత్తులో కూడా పెళ్లి చేసుకోవాలని లేదు అంటూ ఆండ్రియా చెప్పుకొచ్చింది. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెళ్లి గురించి ఆలోచించడం మానేశారు అంది.
ఒంటరి జీవితంకు అలవాటు పడ్డ నేను భవిష్యత్తులో కూడా ఒంటరిగానే సంతోషంగా ఉంటాను అనే నమ్మకం ఉంది. కనుక వివాహ బంధంలో అడుగు పెట్టాలనే ఆసక్తి లేదు. ఇప్పుడు ఉన్నంత సంతోషంగా పెళ్లి చేసుకుంటే ఉండేనేమో అనే ఉద్దేశ్యంతో పెళ్లి ఆలోచన చేయడం లేదని ఆండ్రియా ప్రకటించింది.
సాధారణంగా హీరోయిన్స్ నాలుగు పదుల వయసు చేరిన తర్వాత పెళ్లి చేసుకోవడం కామన్ గా చూస్తూ ఉన్నాం. కానీ ఆండ్రియా మాత్రం 25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలని భావించి, ఆ సమయంలో ఎదురైన సంఘటన కారణంగా ఇప్పుడు పెళ్లి వద్దు అనే నిర్ణయానికి వచ్చిందట.