గ్రీన్‌కో ఎండీ పార్టీలో మహేష్.. రాజమౌళి సినిమాతో లింక్అప్?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త, గ్రీన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ప్రముఖ పారిశ్రామిక వేత్త, గ్రీన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ చలమలశెట్టి 50వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో ఘనంగా జరిగిన ఈ వేడుకల్లో మహేష్ తో పాటుగా చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రామ్ చరణ్, అఖిల్ అక్కినేని లాంటి హీరోలు సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఒక బిజినెస్ మ్యాన్ బర్త్ డే పార్టీకి ఇలా టాలీవుడ్ బిగ్ స్టార్స్ అంతా కుటుంబాలతో కలిసి వెళ్ళడం, డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ప్రైవేట్ పార్టీ వీడియోలలో అరుదుగా కనిపించే మహేష్ బాబు.. తన సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేనితో కలిసి మాల్దీవుల్లో జరిగే పార్టీలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో మహేశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చలమలశెట్టి భాగం అవుతున్నారనే గాసిప్స్ వినిపించడానికి కారణమైంది.
మహేష్ బాబు, ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో 'SSMB 29' సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును, దుర్గా ఆర్ట్స్ బ్యానర్లో సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ నిర్మిస్తారని దర్శకుడు ఇది వరకే ప్రకటించారు. కొత్త ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రంలో చలమలశెట్టి అనిల్ పెట్టుబడులు పెడతారనే వార్తలు వస్తున్నాయి.
SSMB 29 భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా పేర్కొనబనబడుతోంది. RRR వంటి గ్లోబల్ ప్రశంసలు వచ్చిన మూవీ తర్వాత రాజమౌళి టేకాఫ్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారు. దీన్ని ఇంటర్నేషనల్ మూవీగా ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో, భారీ బడ్జెట్ అవసరమవుతుంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారని అని టాక్ వినిపిస్తోంది. దీని కోసం అనిల్ ఫండింగ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
మహేశ్ బాబు - రాజమౌళి సినిమా నిర్మాణంలో ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ భాగం కానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అనిల్ కుమార్ చలమలశెట్టి ఈ హై బడ్జెట్ మూవీలో ఇన్వెస్టర్ గా మారబోతున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. మాల్దీవుల్లో జరిగిన ఆయన పుట్టినరోజు పార్టీలో నిర్మాత కేఎల్ నారాయణ కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. భారీ బడ్జెట్ చిత్రాలకు వ్యాపారవేత్తలు ఫైనాన్స్ చేయడం అనేది కొత్తేమీ కాదు. అందులోనూ వేల కోట్ల బడ్జెట్ అంటున్నారు కాబట్టి, మహేష్ కు ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉండే అనిల్ లాంటి ఇన్వెస్టర్లు అవసరం ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ అడ్వెంచర్ మూవీ. రెండేళ్లు కథ మీద వర్క్ చేశారు. దీని కోసం ఆల్రెడీ జక్కన్న అండ్ టీం లోకేషన్స్ వేట సాగిస్తున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ జనవరిలో ప్రారంభం అవుతుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ మధ్యనే వెల్లడించారు.