ఆస్ట్రేలియాలో అరియానా.. కంగారు పెట్టె గ్లామర్ షో!
ఈ హాట్ బ్యూటీ ఆమె ఆలోచనల సంగతేమో కానీ, దుస్తుల విషయంలో మాత్రం బోల్డ్ గా మారింది.
అరియానా, ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రేక్షకుల కు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ పుణ్యమా అని ఈ బ్యూటీ అందరికీ పరిచయం అయ్యింది. అంతకు ముందు కొన్ని ఛానెల్స్ లో యాంకరింగ్ చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఒక్కసారి సెలబ్రెటీ ఇంటర్వ్యూలో ఆర్జీవీ ని ఈమె ఇంటర్వ్యూ చేయడం, ఆయన అరి పాప అందాలను పొగడటం తో ఒక్కసారిగా అందరి కన్ను ఆమె పడింది. ఫలితం బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చింది.
అక్కడి నుంచి గుర్తింపు తెచ్చుకొని, సెలబ్రెటీ గా మారిపోయింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియా లో సైతం చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ ఇస్తూనే ఉంటుంది. తన ఫ్యాన్స్ కి ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. కాగా అరియానా ను చాలా మంది ఫ్యాన్స్ బోల్డ్ బ్యూటీ అని పిలుచుకుంటూ ఉంటారు. ఆమె డెసిషన్స్, ఆలోచనలు అన్నీ బోల్డ్ గా ఉంటాయని వారి అభిప్రాయం.
అయితే, ఈ హాట్ బ్యూటీ ఆమె ఆలోచనల సంగతేమో కానీ, దుస్తుల విషయంలో మాత్రం బోల్డ్ గా మారింది. క్లీవేజ్ షోల తో మతిపోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఆస్ట్రేలియా టూర్ కి వెళ్లింది. అక్కడ మెల్ బోర్న్ లో ఓ షాపింగ్ మాల్ లో ఫోటోల కు ఫోజులు ఇచ్చింది. స్లైడ్ స్లీవ్ డ్రెస్ లో తన థైస్ తో హాట్ షో చేసింది.
ఈ ఫోటోలు చూస్తుంటే కొంచెం బొద్దుగా మారినట్లు తెలుస్తోంది. గతం లో సన్నజాజి తీగలాగా, జూనియర్ ఇలియానాలో ఉండేది. కానీ, ఇప్పుడు కొంచెం బొద్దుగా మారడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అవుతున్నారరు. మళ్లీ సన్నగా అయిపోవా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఆమె ఫోటో కింద కామెంట్స్ అన్నీ, ఆమె లావుగా అవ్వడం గురించే కావడం గమనార్హం.
ఇదిలా ఉండగా, బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత ఈ బ్యూటీ చాలా బిజీ గా మారింది. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ ఓటీటీ షో ద్వారా అదరగొట్టింది. మధ్యలో అదే బిగ్ బాస్ లో యాంకరింగ్ చేసింది. మొత్తానికి బిగ్ బాస్ దత్త పుత్రిక గా మారి.. స్టార్ మాలో ఏదో ఒక ప్రోగ్రామ్ తో బిజీగా గడుపుతోంది. ఈమధ్యే కాస్త టీవీకి దూరమైంది. మళ్లీ బిగ్ బాస్ షో మొదలవ్వగానే సందడి చేసే అవకాశం లేకపోలేదు.