ప్చ్!! వారి మనోభావాలు దెబ్బతిన్నాయ్

Update: 2017-07-31 11:53 GMT
అసలే మన దేశంలో ఎందుకు ఎప్పుడు మనోభావాలు దెబ్బతింటాయో ఎవ్వరికీ తెలియదు. కులం కోసమో మంత కోసమో.. కారు కోసమో బట్టల కోసమో.. ప్రతీసారి మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. అదే మనోళ్ల పద్దతి. అదిగో ఇక మనోభావాలను దెబ్బతీయడానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారా అంటే అందుకు ముందుగా కమల్ హాసన్ పేరే చెప్పాలి. ఇప్పుడు ఆయన మరోసారి కొంతమంది మనోభావాలను దెబ్బతీశారు తెలుసా!!

తమిళనాడుకు చెందిన పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణసామి ఇప్పుడు కమల్ హాసన్ పై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్‌తో పాటు తమిళ బిగ్‌ బాస్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న కొరియోగ్రాఫర్‌ గాయత్రి రఘురామ్‌ తదితరులపై పరువు నష్టం దావా వేశారు. ఇంతకీ రీజన్ ఏంటో తెలుసా? మొన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో.. మరో నటి గురించి కామెంట్ చేసిన గాయత్రి రఘురామ్.. ‘మురికి స్లమ్ములో ఉండేదానిలా ఆ ప్రవర్తన ఏంటి??’ అంటూ కామెంట్ చేసింది. ఇలా మాట్లాడటం వలన ఆమె నిజంగానే మురికి స్లమ్ముల్లో ఉండే వారి మనోభావాలు దెబ్బతీసిందట. పైగా ఆ వ్యాఖ్యలకు కమల్ కూడా మద్దతు ఇచ్చినట్లేనట. అందుకే ఈ దావా వేశారు.

మరో వారం రోజుల్లో కమల్‌ క్షమాపణలు చెప్పాలని లేదా పరువు నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. దీనిపై కమల్‌ ఇంకా కమల్ స్పందించలేదు కాని.. ఆ లెక్కన చూసుకుంటే అసలు ఇండియాలో ఏ బూతు మాట్టాడిన కూడా మనోభావాలు దెబ్బతినేసినట్లే. అసలు కమల్ ను తిడుతుంటే.. ఇప్పుడు కమల్ అనే పేరుగల వారు.. కమలం అంటే తామర పువ్వు కాబట్టి పూలు అమ్ముకునేవారు.. వారి మనోభావాలు దెబ్బతిన్నాయ్ అని రివర్స్ కేసు వేస్తారేమో చూడండి.
Tags:    

Similar News