మలయాళ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలతో ఆకట్టుకుంటూ హీరోగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్ గా 'జనగణమన', కడువా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పృథ్వీరాజ్ మలయాళంలో ఆరు క్రేజీ ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇందులో 'ఆడు జీవితం' ఒకటి. బ్లెస్సీ దర్శకత్వం వహిస్తున్నారు. అమలా పాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని బెనీయమీన్ రచించిన 'గోట్ డేస్' అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.
టివినో థామస్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ గా పూర్తయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడిస్తూ ఓ ఆసక్తికరమైన పోస్ట్ ని షేర్ చేశారు. '14 సంవత్సరాల. వెయ్యి అడ్డంకులు, మిలియన్ సవాళ్లు, మహమ్మారి మూడు వేవ్‌లు.. వీటన్నింటినీ తట్టుకుని బ్లెస్సీ అద్భుత సృష్టి 'ఆడు జీవితం' షూటింగ్ పూర్తయింది. ప్యాకప్ చెప్పేశాం' అంటూ ఓ ఫొటోని అభిమానులతో పంచుకున్నారు.
హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నట్టుగా ఈ చిత్ర బృందం నిజంగా ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం చిన్న పాటి యుద్ధమే చేసిందని చెప్పొచ్చు. 3డీ ఫార్మాట్ లో రూపొందుతున్న ఈ మూవీని 2018 మార్చిలో కేరళ లో ప్రారంభించారు. ఫ్లాష్ బ్యాక్ సీన్ లకు సంబంధించిన షూటింగ్ ని సౌదీ అరేబియా ఎడారిలో చేయాలని ప్లాన్ చేశారు. ఆ తరువాత మిడిల్ ఈస్ట్ లోని ఎడారిలో చిత్రీకరించాలనుకున్నారు. ఇక మేజర్ షెడ్యూల్ కోసం 2020లో చిత్ర బృందం అంతా జోర్డాన్ లోని వాడరమ్ ఎడారికి వెళ్లారు.
అక్కడ షూటింగ్ మొదలు పెట్టిన సందర్భంలోనే కరోనా ప్రపంచాన్ని ఆవహించడం మొదలు పెట్టింది. ఈ టైమ్ లో జోర్డాన్ లోనూ లాక్ డౌన్ ని విధించారు. దీంతో అక్కడి నుంచి హీరోతో పాటు చిత్ర బృందంఇండియా తిరిగి రావడం అసాధ్యంగా మారింది. ఈ దశలో యూనిట్ లోని ఓ వ్యక్తి కూడా మరణించడంతో టీమ్ అంతా తీవ్ర భయాందోళనకు గురైంది. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ రోజులు లెక్కపెట్టడం మొదలు పెట్టారు.
ఇదే టైమ్ లో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వైఫ్ సుప్రియ మీనన్ ప్రెగ్నెంట్. తన పరిస్థితి ఎలా వుందో అని పృథ్వీరాజ్ సుకుమారన్ జోర్డాన్ లో, అతని వైఫ్ కేరళలో నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు మళ్లీ లాక్ డౌన్ ఎత్తివేయడంతో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు చిత్ర బృందం క్షేమంగా కేరళ చేరుకుంది. అప్పటి నుంచి ఆగుతూ సాగుతూ వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఫైనల్ గా ఇప్పటికి పూర్తి కావడం విశేషం.
ఇటీవల విడుదలై పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ అందరిని షాక్ కు గురిచేసిన విషయం తెలిసిందే. గొర్రెల కాపరిగా పృథ్వీరాజ్ కనిపించిన తీరు షాక్ కు గురిచేసింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్, కె.యు.మోహనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.