ప్రముఖ దర్శకుడు సుకుమార్ కలం నుంచి జాలువారే ప్రేమ కథలు రొటీన్ కు భిన్నంగా ఉంటాయి. ఆయన దర్శకత్వం వహించే సినిమాలే కాదు.. కథ -స్క్రీన్ ప్లే అందించేవాటికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. దీంతో సుకుమార్ కథ స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా '18 పేజెస్' పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. సినిమా టైటిల్ ఒక్కసారిగా అందరిని ఆకర్షించింది. ఈ సినిమాను జీఎ2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ఇలా ప్రకటించారో లేదో ఈ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కు కూడా ఏదో ఫ్రెంచ్.. కొరియన్.. మంగోలియన్ సినిమాలలో మూలం ఉంటుందని కొందరి అభిప్రాయం. సుకుమార్ గతంలో కథ అందించి సూపర్ హిట్ గా నిలిచిన 'కుమారి 21 F' సినిమాకు ఓ ఫ్రెంచ్ సినిమా మూలం అనే సంగతి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు అలానే ఈ సినిమాకు కూడా సుకుమార్ ప్రేరణ పొంది మరీ కథ రాసి ఉంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే జస్ట్ '18 పేజెస్' అనే టైటిల్ తో మూలం ఏదో కనుక్కోవడం కష్టం కాబట్టి నెటిజన్లకు అదెలా తెలుసుకోవాలా అని ఆరాటంగా ఉంది. కనీసం టీజరో.. ట్రైలరో విడుదలైతే తప్ప ఆ సినిమాతో పోలికలున్న ఇతర సినిమాలను గూగుల్ లో సెర్చ్ చెయ్యలేం అని వారు దిగులు పడుతున్నారు.
18 పేజీల ప్రేమ కథకోసం సుకుమారుడు స్ఫూర్తి పొందారా లేక నిజ్జంగా ఒరిజినల్లేనా అనే విషయం ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుంది. అయితే ప్రతిదీ అనుమానిస్తే మనల్ని అనుమానపు పక్షులు అంటారు కాబట్టి ఈ సారికి మన సుక్కు భయ్యా ఒరిజినల్ కథ రాసి ఉంటారని.. సూర్య ప్రతాప్ భయ్యా ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆశిద్దాం.