300 కోట్లతో ఛాన్స్.. అయినా టెంప్ట్ అవ్వని తండేల్ డైరెక్టర్
యంగ్ డైరెక్టర్లు ఒక్క హిట్ కొట్టగానే స్టార్ హీరోల నుంచి ఆఫర్లు రావడం సహజమే. కానీ ఆ అవకాశాలను మెటీరియలైజ్ చేసుకోవడం, ఫెయిలవడం మాత్రం పూర్తిగా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
యంగ్ డైరెక్టర్లు ఒక్క హిట్ కొట్టగానే స్టార్ హీరోల నుంచి ఆఫర్లు రావడం సహజమే. కానీ ఆ అవకాశాలను మెటీరియలైజ్ చేసుకోవడం, ఫెయిలవడం మాత్రం పూర్తిగా వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ లిస్టులో తాజాగా చందూ మొండేటి పేరు తెరపైకి వచ్చింది. కార్తికేయ సిరీస్‌తో సాలీడ్ క్రేజ్ తెచ్చుకున్నా, అతను ఇప్పటివరకు ఇద్దరు హీరోలతోనే పరిమితం అవ్వడం ఆసక్తిగా మారింది.
నిఖిల్, నాగచైతన్యలతో వరుసగా సినిమాలు చేసినా, స్టార్ హీరోలతో పనిచేసే పరిస్థితి మాత్రం దక్కలేదు. అలాగని అతనికి ఛాన్సులు రాకుండా ఉండలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్యలతో సినిమాల చాన్స్ వచ్చినా, వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయలేదట. దానికి కారణం ముందుగా అతను సెట్ చేసికున్న కాంబినేషన్స్. చందూ. కార్తికేయ 2 విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి పిలుపు వచ్చిందట, ఆయన అప్పటికే వేరే సినిమాల్లో బిజీ అవ్వడంతో అది అటకెక్కింది.
అలాగే, గీతా ఆర్ట్స్‌లో ఓ స్ట్రైట్ ఫిల్మ్ చేసే ఛాన్స్ వచ్చింది. అరవింద్, రామ్ చరణ్ లేదా సూర్యతో ఓ భారీ బడ్జెట్ చిత్రం చేద్దామని భావించారట. కార్తికేయ 2 హ్యాండ్లింగ్ చూసిన తర్వాత చందూ భారీ బడ్జెట్ హ్యాండిల్ చేయగలడనే నమ్మకంతో, ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ పెట్టేందుకు రెడీ అయ్యారట. కానీ చందూ మొండేటి మాత్రం పెద్ద బడ్జెట్ మూవీకి వెళ్లకుండా ముందుగా తండేల్నే ఎంచుకున్నాడు.
"తండేల్ కథ నాకు చాలా నచ్చింది. అరవింద్ గారు పెద్ద ప్రాజెక్ట్ చేయమన్నారు, కానీ నాకు ఈ కథపై బలమైన నమ్మకం ఉంది. అందుకే తండేల్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నా." అంటూ చందూ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. సడన్ గా భారీ బడ్జెట్‌కు ఆకర్షితుడవ్వకుండా, తనకు నచ్చిన కథను ఎంచుకోవడం అతని సాహసోపేత నిర్ణయమని చెప్పవచ్చు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో చందూ మొండేటి ఎక్కువగా యూత్, థ్రిల్లర్స్‌కు పరిమితం అయ్యాడు.
కానీ తండేల్ మాత్రం ఓ మాస్, ఎమోషనల్ డ్రామా. ఈ సినిమాతో తన రేంజ్‌ను పెంచుకునే అవకాశం ఉందని అనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే, మరింత బలమైన స్థాయిలో టాలీవుడ్లో తన స్థానం సుస్థిరం చేసుకోగలడు. ఇదిలా ఉంటే, వెంకటేష్ నాగార్జునల మల్టీస్టారర్ కూడా చందూ ప్లాన్ చేస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇది ఓ పోలీస్ థ్రిల్లర్ కానుందని, వెంకీ-నాగ్ కాంబో అంటే మామూలు క్రేజ్ ఉండదని చెప్పొచ్చు. కానీ అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో తెలియదు. ప్రస్తుతానికి, తండేల్ రిజల్ట్ మీదే అందరి ఫోకస్ ఉంది. మరి ఆ సినిమా ఏ రేంజ్ లో క్లిక్కవుతుందో చూడాలి.