హిట్ కోసం ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న నాని!

మరికొంత‌మంది త‌మ సినిమాను ఫ‌లానా నెల‌, ఫ‌లానా తేదీన రిలీజ్ చేయాల‌నుకుంటారు. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.;

Update: 2025-03-04 13:30 GMT

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తీ ఒక్క‌రూ ఏదొక సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఉంటారు. కొంత‌మంది డైరెక్ట‌ర్లు ఫ‌లానా ప్లేస్ లోనే త‌మ సినిమాల‌కు క‌థ‌ల‌ను రాయాల‌ని ఆ ప్లేస్ ను సెంటిమెంట్ గా భావిస్తుంటారు. మరికొంత‌మంది త‌మ సినిమాను ఫ‌లానా నెల‌, ఫ‌లానా తేదీన రిలీజ్ చేయాల‌నుకుంటారు. ఇలా ఒక్కొక్క‌రికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.

ఇప్పుడు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కూడా అలాంటి ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న‌ట్టు తెలుస్తోంది. బాగా ప‌రిశీలిస్తే నాని గ‌త కొన్ని సినిమాలుగా దాన్ని అనుస‌రిస్తున్న‌ట్టు అర్థ‌మ‌వుతుంది. ఆ సెంటిమెంట్ ఏంటంటే నాని త‌ను న‌టించిన సినిమాల‌ను గురువారం రోజున రిలీజ్ చేయ‌డం. వాస్త‌వానికి సినిమాలు ఎక్కువగా శుక్ర‌వారం రిలీజ‌వుతుంటాయి.

కానీ నాని 2023లో తాను న‌టించిన ద‌స‌రా సినిమాను మార్చి 30న గురువారం రోజున రిలీజ్ చేశాడు. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆ త‌ర్వాత నాని నుంచి వ‌చ్చిన హాయ్ నాన్న సినిమా 2023 డిసెంబ‌ర్ 7న రిలీజైంది. ఆ రోజు కూడా గురువార‌మే. హాయ్ నాన్న కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. ఇక గ‌తేడాది వ‌చ్చిన స‌రిపోదా శ‌నివారం ఆగ‌స్ట్ 29 గురువారం రిలీజై సూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇక‌ ప్ర‌స్తుతం నాని చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న హిట్3. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. మే1 కూడా గురువార‌మే. రెండో సినిమా శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో రానున్న ది ప్యార‌డైజ్. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేయ‌నున్న మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. 2026, మార్చి 26 కూడా గురువార‌మే.

ఇదంతా చూస్తుంటే నాని ఈ గురువారం సెంటిమెంట్ ను చాలా బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు అనిపిస్తోంది. గ‌తంలో త‌ను న‌టించిన సినిమాలు గురువారం రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్లైన నేప‌థ్యంలో నెక్ట్స్ త‌న నుంచి రాబోయే సినిమాల‌ను కూడా గురువారం సెంటిమెంట్ తో రిలీజ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకోవాల‌ని నాని ఫిక్సై పోయిన‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News