ఎట్టకేలకు స్టార్ హీరో సినిమాకి బజ్...!
సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి మేకర్స్ ఏదో విధంగా సినిమాకు బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు.;
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాప్‌ల తర్వాత నటించిన సినిమా 'సికిందర్'. తమిళ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సౌత్ హీరోయిన్ రష్మిక మందన్న నటించింది. రష్మిక గత చిత్రాలు పుష్ప 2, ఛావా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. దాంతో సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాకు సైతం రష్మిక మందన్న సెంటిమెంట్ వర్కౌట్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఛావా సినిమా జోరు తగ్గడంతో పాటు సికిందర్ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ప్రేక్షకులు సల్మాన్ ఖాన్ రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి మేకర్స్ ఏదో విధంగా సినిమాకు బజ్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇటీవల టీజర్ విడుదలైన సమయంలోనూ సికిందర్‌కి ఒక మోస్తరు సినిమానే అని, రెగ్యులర్ కమర్షియల్ సినిమా మాదిరిగానే ఉంటుందేమో అనే టాక్ వచ్చింది. టీజర్ అంచనాలు పెంచలేక పోవడంతో మేకర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో సికిందర్ నుంచి వచ్చిన జోహ్రా జబీన్ పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. పండుగ వాతావరణం కనిపిస్తున్న ఆ పాటతో సికిందర్ సినిమాకు బజ్ క్రియేట్ అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్, మురుగదాస్ కాంబోలో రూపొందుతున్న సికిందర్ సినిమాకు ప్రీతమ్ చక్రవర్తి , సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా వచ్చిన జోహ్రా జబీన్ పాటలో సల్మాన్ ఖాన్‌తో పాటు రష్మిక మందన్న లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాను చూడవచ్చు అనే అభిప్రాయం ఈ పాట కలిగించింది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇన్ని రోజులుగా లేని బజ్ ఎట్టకేలకు వచ్చింది అంటూ సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు, సినిమా యూనిట్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జోష్‌ను కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమాలు కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకుని చాలా ఏళ్లు అవుతుంది. ఆయన హీరోగా సినిమాలు చేయడం మానేయాలి అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ నుంచి రాబోతున్న సినిమా కావడంతో పెద్దగా అంచనాలు లేవు. అయితే సినిమాకు మినిమం బజ్ క్రియేట్ అయితేనే ఓపెనింగ్స్ వస్తాయి. కనుక సాధ్యం అయినంత వరకు సికిందర్ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తారు. విడుదలకు ఇంకాస్త సమయం ఉంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు పెంచాలని మేకర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సికిందర్‌తో అయినా సల్మాన్ ఖాన్ ఫేట్ మారేనా? లక్ కలిసి వచ్చేనా? అనేది చూడాలి.