యానిమ‌ల్ 'న‌గ్న స‌న్నివేశం' అలా వ‌ర్క‌వుటైంది!

అయితే 'యానిమల్' కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ ద‌ర్శ‌కుడు కోరుకున్న విధంగానే ప‌ని చేసారా? అంటే.. అవున‌నే సందీప్ వంగా ధృవీకరించారు.;

Update: 2025-03-04 10:30 GMT

క‌థానాయ‌కుడు ఏదైనా సినిమాకి సంత‌కం చేసిన‌ప్పుడు పూర్తిగా ద‌ర్శ‌కుడిని న‌మ్మాలి. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నంపై వంద‌శాతం న‌మ్మ‌కం ఉంచితేనే ప‌ని సునాయాసంగా ముందుకు సాగుతుంది. అలా కాకుండా న‌మ్మ‌కం స‌డ‌లిపోతే, హీరో అన‌వ‌స‌రంగా ద‌ర్శ‌కుడి ప‌నిలో వేలు పెడితే సీన్ ఎలా సితార అవుతుందో గ‌తంలో చాలా అనుభ‌వాలున్నాయి. చాలా సినిమాలు దార‌ణ‌మైన ఫ‌లితాల‌ను ఎదుర్కోవ‌డంలో ద‌ర్శ‌కుడి ప‌నిలో హీరో క‌ల‌గ‌జేసుకోవ‌డమేన‌ని చెబుతుంటారు.

అయితే 'యానిమల్' కోసం ర‌ణ‌బీర్ క‌పూర్ ద‌ర్శ‌కుడు కోరుకున్న విధంగానే ప‌ని చేసారా? అంటే.. అవున‌నే సందీప్ వంగా ధృవీకరించారు. మీకు ఏం కావాలో అది చేస్కోండి.. అడ‌గొద్దు! అని ర‌ణ‌బీర్ త‌న‌కు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చాడ‌ని, అది త‌న ప‌నిని సుల‌వు చేసింద‌ని సందీప్ వంగా తెలిపాడు. అలాంటి అర్థం చేసుకునే త‌త్వం, స‌హకారం ఈ చిత్రంలో స‌న్నివేశాలు బాగా తీయ‌గ‌ల‌గ‌డానికి స‌హ‌క‌రించాయ‌ని అన్నారు. ముఖ్యంగా ర‌ణ‌బీర్ న‌గ్నంగా న‌డుచుకుని వెళ్లే సీన్ తీయ‌డాన్ని అత‌డు చాలా సులువు చేసాడ‌ని వంగా తెలిపారు. ద‌ర్శ‌కుడికి హీరో ఇచ్చిన కోఆప‌రేష‌న్ తోనే ఆ సీన్ అంత బాగా పండింది. అది ఎక్క‌డా ఎబ్బెట్టుగా లేదు. అయితే ఈ సీన్ కోసం కొన్ని గంట‌ల పాటు ర‌ణ‌బీర్ ని వెయిట్ చేయించార‌ట సందీప్ వంగా. అంత సేపు వెయిట్ చేస్తే ఎవ‌రైనా చిరాకు ప‌డ‌తారు. కానీ ద‌ర్శ‌కుడు ఏం చెబుతాడో అది చేయ‌డానికి ర‌ణ‌బీర్ చాలా వెయిట్ చేసాడు. దేనినీ నిరాక‌రించ‌లేదు. న‌చ్చిన‌ది చేయండి.. ఏమీ అడ‌గొద్దు! అని ద‌ర్శ‌కుడికి హీరో స‌హ‌క‌రించాడు. ద‌ర్శ‌కుడి విజ‌న్ ని న‌మ్మి హీరో స్వేచ్ఛ‌నిచ్చాడు.

అయితే ఈ సీన్ తీసేప్పుడు మొదట తొడలు - శరీరం దిగువ భాగానికి ప్రోస్తేటిక్స్ పెట్టాలని అనుకున్నామని, టెస్ట్ షూట్ సమయంలో ఇది పర్ఫెక్ట్ గా వచ్చినా కానీ షూటింగ్ చేస్తున్నప్పుడు బాగా కనిపించలేదని చెప్పాడు. వాస్తవానికి, మేము సన్నివేశాన్ని పూర్తి ఫోకస్‌లో చిత్రీకరించాలని .. న‌గ్నంగా నడుస్తున్నప్పుడు గజ్జను కవర్ చేయడానికి ప్రాప్‌లను ఉపయోగించాలని ప్లాన్ చేసాము. అయితే ప్రోస్తేటిక్స్ సరిగ్గా పనిచేయకపోవడంతో సన్నివేశాన్ని ఫోకస్‌లో లేకుండా బ్ల‌ర్ లో షూట్ చేసామ‌ని వంగా తెలిపాడు.

ప్రోస్త‌టిక్స్ కొల‌త‌లు అంటూ గంట‌ల స‌మ‌యం వెయిట్ చేయించాక ..ఒక నటుడు చిరాకు పడటానికి అవ‌కాశం ఉంది. కానీ దానికి భిన్నంగా షూట్ కి రెడీగా ఉన్నాడు ర‌ణ‌బీర్. మా మ‌ధ్య ఎలాంటి డిస్క‌ష‌న్లు లేవు. పది నిమిషాల చ‌ర్చ త‌ర్వాత ఆ సీన్ ని ఫోకస్‌లో లేకుండా చిత్రీకరించాను. దీనివ‌ల్ల న‌గ్న‌ సీన్ మ‌రింత‌ ఆసక్తికరంగా మారింది అన్నాడు.

నటుడు, దర్శకుడి మధ్య అలాంటి బంధం స‌న్నివేశాన్ని చాలా సౌకర్యవంతంగా చేస్తుందని సందీప్ వంగా అన్నారు. ఫలితం ఏదైనా కావచ్చు! కానీ ఒక అవగాహనతో పని చేయడం సరదాగా మారుతుందని ఒక‌రిపై ఒక‌రికి న‌మ్మ‌కం చాలా అవ‌స‌ర‌మ‌ని వంగా అన్నారు. ప్ర‌స్తుతం యానిమ‌ల్ సీక్వెల్ `యానిమల్ పార్క్` కోసం అభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News