అనసూయ.. ఏజ్ లెస్ బ్యూటీ!

టాలీవుడ్‌లో యాంకర్‌గా మొదలై, తన టాలెంట్‌తో స్టార్ హోస్ట్‌గా మారిన అమ్మడు అనసూయ భరద్వాజ్.;

Update: 2025-03-04 09:32 GMT

టాలీవుడ్‌లో యాంకర్‌గా మొదలై, తన టాలెంట్‌తో స్టార్ హోస్ట్‌గా మారిన అమ్మడు అనసూయ భరద్వాజ్. రియాలిటీ షోలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అంటూ విభిన్నమైన ప్రాజెక్టులతో ఆకట్టుకుంటూ వస్తోంది. ఇదే క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తన ఫోటోలు గట్టిగానే వైరల్ అవుతున్నాయి. కొత్తగా ట్రై చేసిన అవుట్‌ఫిట్‌తో మరింత స్టైలిష్‌గా కనిపిస్తూ, ఫ్యాషన్‌ విషయంలో ట్రెండ్ సెట్టర్ అనిపించుకుంటోంది.


పింక్ కలర్ వెస్ట్రన్ డ్రెస్‌లో అనసూయ రాజసంగా మెరిసిపోతూ, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ డ్రెస్సింగ్‌కు మ్యాచింగ్‌గా చేసిన మేకప్, హెయిర్‌స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఫొటోషూట్‌లో అనసూయ చూపించిన ఎక్స్‌ప్రెషన్స్ మరింత హైలైట్‌గా నిలిచాయి. ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలపై నెటిజన్లు భారీగా స్పందిస్తూ, ఏజ్ లెస్ బ్యూటీ, అసలైన క్వీన్ అనసూయ.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అనసూయ గ్లామర్, స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ, ట్రెండ్ క్రియేట్ చేస్తుంటుంది. ఈ ఫోటోషూట్ కూడా అందులో భాగమే. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ, తన స్టన్నింగ్ లుక్స్‌తో నెటిజన్లకు కనువిందు అందిస్తోంది. ఈ ఫోటోలు ట్రెండింగ్‌లో నిలుస్తుండటంతో, మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.


కెరీర్ పరంగా అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెండింట్లోను బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన పుష్ప 2 లోని దాక్షాయణి క్యారెక్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, పలు క్రేజీ ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి. త్వరలో విడుదల కానున్న హరిహర వీరమల్లు ప్రాజెక్ట్‌లోనూ ఆమె స్పెషల్ సాంగ్ లో హైలెట్ కానుంది. అలాగే తమిళంలో రెండు సినిమాలతో బిజీగా ఉంది.

Tags:    

Similar News