కిరణ్ అబ్బవరం.. మళ్ళీ స్పీడ్ పెంచేశాడు

టాలీవుడ్‌లో తనదైన మార్క్ తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన కెరీర్‌ను మరింత స్ట్రాంగ్ గా సెట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా మారిపోయాడు.;

Update: 2025-03-04 11:08 GMT

టాలీవుడ్‌లో తనదైన మార్క్ తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, తన కెరీర్‌ను మరింత స్ట్రాంగ్ గా సెట్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా మారిపోయాడు. ‘KA’ సినిమా ద్వారా మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చిన ఈ యువ హీరో, తాజాగా మూడు కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. గత కొంతకాలంగా కిరణ్ తన కథల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో తన తాజా ప్రాజెక్ట్స్ గురించి అధికారికంగా వివరాలు వెల్లడించకపోయినా, ప్రేక్షకుల్లో కిరణ్ అబ్బవరం తదుపరి ప్రాజెక్టులపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం ‘దిల్ రూబా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కిరణ్ అబ్బవరం, ఈ సినిమా విడుదల అనంతరం ‘K ర్యాంప్’ షూటింగ్‌లో చేరనున్నారు. కొత్త దర్శకుడు నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది.

ఎమోషన్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్ని పర్ఫెప్ట్ గా ఉండే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాను రజేష్ దండా నిర్మిస్తున్నాడు. ఇది కిరణ్ అబ్బవరం కెరీర్‌లో కీలకమైన ప్రాజెక్ట్ అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. అంతేకాదు, ‘KA’ దర్శకులతో కలిసి మరోసారి పని చేయడానికి కిరణ్ అబ్బవరం రెడీ అవుతున్నాడు. ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించేందుకు దర్శకులు సిద్ధమవుతుండగా, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ‘KA’ సక్సెస్ తర్వాత కిరణ్ అబ్బవరం ఈ కథను కంటిన్యూ చేయడం ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నారు.

సీక్వెల్‌లో కథ ఎలా ఉండబోతుందో అనే విషయంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే, ‘K ర్యాంప్’తో పాటు మరో రెండు కొత్త సినిమాలకు కిరణ్ అబ్బవరం అంగీకారం తెలిపినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఇవన్నీ కిరణ్ మాస్, కమర్షియల్ హీరోగా ముద్ర వేయడానికి ఉపయోగపడే కథలే అని టాక్.

రొటీన్ స్టోరీల నుంచి కాస్త విభిన్నంగా ఉండే సినిమాలను ఎంచుకోవాలని కిరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం తన కెరీర్‌ను మరో మెట్టుపైకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాడు. కొత్త కథలు, వైవిధ్యమైన కథనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘KA’ ద్వారా తన మార్కెట్‌ను నిలబెట్టుకున్న ఈ యువ హీరో, ‘దిల్రుబా’, ‘K ర్యాంప్’ వంటి సినిమాలతో మరోసారి తన స్థాయిని పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ప్రాజెక్ట్స్ ద్వారా కిరణ్ అబ్బవరం మార్కెట్ రేంజ్ ఏ స్తాయిల్ప్ పెరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News