ఈ టైమ్ లో రష్మికపై 70 కొట్లంటే..

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మార్కెట్ లో బిజినెస్ చేయడం అసలు టాస్క్.;

Update: 2025-03-04 12:30 GMT

టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మార్కెట్ లో బిజినెస్ చేయడం అసలు టాస్క్. కథ బలంగా ఉంటేనే ఆ సినిమాలు నిలదొక్కుకుంటాయి, లేదంటే డిజాస్టర్ తప్పదు. అనుష్కతో అరుంధతి బిగ్గెస్ట్ లేడి ఓరియెంటెడ్ హిట్. కానీ అందులో గ్రాఫిక్స్ తో పాటు కథ బలం అనుష్క పెర్ఫెమెన్స్ సినిమాను మరో లెవెల్ కు తీసుకు వెళ్ళాలి. ఇక UV క్రియేషన్స్ గతంలో అనుష్కతో భాగమతి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. ఆ సమయంలో అనుష్క క్రేజ్, కంటెంట్ కలిసి పనిచేయడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించగలిగింది.

కానీ అదే అనుష్క తర్వాత చేసిన నిశ్శబ్ధం వంటి సినిమాలు ఆడలేదు. ఇప్పుడు UV క్రియేషన్స్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో 70-100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా దర్శకుడు ఎవరు తారాగణం ఏంటి అనే విషయాలు బయటకు రాలేదు. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్లాన్ తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటీవల టాలీవుడ్‌లో హీరోయిన్లు ప్రధానంగా నడిపిన సినిమాలు ఓటీటీలో హిట్ అయినా, థియేటర్స్‌లో మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. సమంత కూడా శాకుంతలం లాంటి భారీ ఫెయిల్యూర్స్ తర్వాత మళ్లీ సైలెంట్ అయ్యింది. ఆమెకు ఉన్న స్టార్‌డమ్ కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను నిలబెట్టలేకపోయింది. అదే విధంగా సాయి పల్లవి మంచి నటనా ప్రతిభ ఉన్నప్పటికీ, ఆమె చేసిన గార్గి లాంటి సోలో హీరోయిన్ ప్రాజెక్ట్స్ పెద్దగా క్లిక్కవ్వలేదు. హీరోల సినిమాల్లో ఆమె హిట్ సాధించినా, తన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

కీర్తి సురేష్ విషయానికి వస్తే మహానటి వంటి సూపర్ హిట్ తర్వాత ఆమె చేసిన మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి ప్రయోగాత్మక సినిమాలు దారుణంగా విఫలమయ్యాయి. ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్నా, ఆమె ప్రధానంగా నడిపిన సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. దీన్ని బట్టి చూస్తే, ఈమధ్య కాలంలో లేడి ఓరియెంటెడ్ కథలు బాక్సాఫీస్ వద్ద లాభాలు అందించినవి లేవు. ఇక ఈ రూట్లో సినిమాలకు పెద్ద బడ్జెట్ పెట్టడం వ్యాపారపరంగా ప్రమాదకరమైన నిర్ణయం అని చెప్పొచ్చు.

రష్మిక ఇప్పుడు ఇండియన్ సినిమా మొత్తంలో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతోంది. అనిమల్, పుష్ప 2, ఛావా వంటి పాన్ ఇండియా హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నా, ఈ సినిమాల్లో ఆమె పాత్రలు పరిమితంగానే ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఆమెను నమ్మి 70-100 కోట్ల బడ్జెట్ పెట్టడం అత్యంత రిస్క్‌తో కూడుకున్నది. ఈ తరహా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే కేవలం హీరోయిన్ గ్లామర్, క్రేజ్ కాదు.. కంటెంట్ కూడా బలంగా ఉండాలి.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలు సక్సెస్ అవ్వాలంటే విభిన్నమైన కథనం, ఆసక్తికరమైన ట్రీట్మెంట్ తప్పనిసరి. కానీ ట్రెండ్ చూస్తే హీరోయిన్లపై ఆధారపడిన పెద్ద సినిమాలు థియేటర్లలో హిట్ అవ్వడం చాలా అరుదు. మరి UV క్రియేషన్స్ రష్మికతో చేస్తున్న కొత్త ప్రయోగం ఎలాంటి క్రేజ్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News