నాని టైర్-1 టార్గెట్.. ఈసారి సాధ్యమే..?
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నేచురల్ స్టార్ నాని, ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.;
టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నేచురల్ స్టార్ నాని, ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం వంటి సినిమాలు భారీ విజయాలను అందుకోవడంతో పాటు 100 కోట్ల క్లబ్‌లో చేరి, అతని మార్కెట్‌ను మరింత పెంచాయి. అది కూడా స్టార్ దర్శకుల సపోర్ట్ లేకుండానే అతని మార్కెట్ రేంజ్ పెరుగుతుండడం విశేషం. నాని ఎక్కువగా టాలెంటెడ్ గా ఉండే కొత్త దర్శకులతోనే ప్రయోగాలు చేస్తూ మార్కెట్ పెంచుకోవడం విశేషం.
ఇక నాని నెక్స్ట్ టార్గెట్ టైర్ 1 అనే చెప్పాలి. టాలీవుడ్‌లో ‘టైర్-1’ లీగ్ అంటే, 500 కోట్లు దాటి దేశవ్యాప్తంగా కలెక్షన్లు రాబట్టే స్థాయికి వెళ్లాలి. అదే లీగ్‌లో పుష్ప, బాహుబలి, RRR లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ కోణంలో చూస్తే, నాని తన తరువాతి సినిమాలతో ఆ స్థాయిని అందుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ టీజర్ రిలీజ్ అయ్యాక, సినిమా పట్ల అంచనాలు గట్టిగా పెరిగాయి. నాని టోటల్‌గా ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యి, ఓ రా అండ్ ఇన్టెన్స్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నట్లు స్పష్టమైంది.
మరోవైపు, ‘హిట్ 3’ కూడా హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో పర్ఫామ్ చేస్తాయో అనేదే ఇప్పుడు నాని కెరీర్‌ను మలుపు తిప్పే అంశం. నాని ఇప్పటి వరకు ఎక్కువగా క్లాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యే సినిమాలనే చేశాడు. కానీ, ‘దసరా’ ద్వారా మాస్ హీరోగా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడు.
ఇప్పుడు ‘ది ప్యారడైజ్’, ‘హిట్ 3’ సినిమాల ద్వారా యాక్షన్ డోస్ పెంచి ఆ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’ టీజర్ చూస్తే, ఇది అతని కెరీర్‌లోనే మోస్ట్ డిఫరెంట్ మూవీగా నిలిచే అవకాశముంది. ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్న దాని ప్రకారం, ‘ది ప్యారడైజ్’కు నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్ ఉంది. అదే విధంగా ‘హిట్ 3’ కూడా ఫ్రాంచైజీలో మోస్ట్ ఇంటెన్స్ మూవీ అవుతుందనే టాక్ నడుస్తోంది.
ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే, నాని ఖచ్చితంగా ‘టైర్ 1’ హీరోల లిస్ట్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. కానీ, ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఇప్పటివరకు నాని సినిమాలు 100 కోట్లు తప్పితే కనీసం 150 కోట్లకు చేరలేదు. ముందు అతను జెట్ స్పీడ్ లో 200 కోట్లు రాబట్టాలి. ఇక ది ప్యారడైజ్ సినిమాకు పవర్ఫుల్ టాక్ రావడమే కాకుండా మిగతా భాషల్లో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవాలి. ఆ రూట్లో గనక బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మార్క్ ను టచ్ చేయగలిగితే అగ్ర హీరోల లిస్టులో చేరినట్లే.
సినిమా మార్కెట్‌లో టాప్ లీగ్‌లో ఉండాలంటే, పాన్ ఇండియా హిట్స్ అవసరం. హిట్ 3, ది ప్యారడైజ్ రెండు సినిమాలు కనుక భారీ ఓపెనింగ్స్ తీసుకుని, హిందీ మార్కెట్‌ను దాటి ఇతర ఇండస్ట్రీలలో రాణిస్తే, నానికి ‘పుష్ప’ లాంటి క్రేజ్ రావచ్చు. కానీ, ఇది పూర్తిగా కథ, కథనంపై ఆధారపడి ఉంటుంది. మరి దర్శకులు కంటెంట్ తో ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.