వాటే సెల్ఫీ న్యాచురల్ స్టార్..!
దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సినిమాగా ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉండగా వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ కట్ అదిరిపోయింది.;
న్యాచురల్ స్టార్ నాని ప్యారడైజ్ గ్లింప్స్ తో సర్ ప్రైజ్ చేశాడు. నాని ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసి ఆడియన్స్ అంతా కూడా షాక్ అయ్యారు. అష్టా చమ్మా సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నాని ఇప్పుడు ప్యారడైజ్ లో ఒక ఊర మాస్ యాటిట్యూడ్ కలిగిన హీరోగా కనిపించడం నిజంగానే ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ అందించింది. దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న సినిమాగా ప్యారడైజ్ పై భారీ అంచనాలు ఉండగా వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ టీజర్ కట్ అదిరిపోయింది.
ఐతే ప్యారడైజ్ గ్లింప్స్ తో సినిమాపై అంతటా డిస్కషన్ జరిగేలా చేసిన నాని టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి సూపర్ హ్యాపీగా ఉన్నాడు. అంతేకాదు లేటెస్ట్ గా ఒక సెల్ఫీ ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ మొత్తం ఎనర్జీ, ప్రేమ నన్ను అలా సినిమా కోసం మారిపోయేలా చేస్తుందని.. ధన్యవాదాలు అంటూ కామెంట్ రాసుకొచ్చాడు. అంటే నాని మీ ఎనర్జీ, ప్రేమ వల్లే ఇదంతా సాధ్యమైంది అంటున్నాడు.
నిజంగానే అష్టా చమ్మా టైం లో కెరీర్ మొదట్లో నాని ఇంత స్ట్రాంగ్ హీరోగా కొనసాగుతాడని అనుకోలేదు. మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా వాటిని దాటుకున్నాడు. అంతేకాదు తనదైన శైలిలో సినిమాలు చేస్తూ కొత్త దర్శకులతో పనిచేస్తూ హిట్లు సూపర్ హిట్లు కొట్టాడు. నాని సినిమాలో కథ ముందు అధిక ప్రాముఖ్యతగా ఉంటుంది. ఆ తర్వాత అతని పాత్ర మిగతా యాస్పెక్ట్స్ చూస్తాడు.
ఈమధ్య నాని ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్టే అవుతుంది. డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నాని దసరా తర్వాత మళ్లీ మరో మాస్ విధ్వంసానికి సిద్ధమయ్యాడని ప్యారడైజ్ టీజర్ చూస్తే అర్థమైంది. శ్రీకాంత్ ఓదెల నిజంగానే నాని ని ఏదో చేసేలా ఉన్నాడని ఫిక్స్ అయ్యారు న్యాచురల్ స్టార్ ఫ్యాన్స్.
ప్యారడైజ్ టీజర్ చూసిన చాలామంది నాని కష్టానికి, కమిట్మెంట్ కి హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. త్వరలో హిట్ 3 తో రాబోతున్న నాని ప్యారడైజ్ సినిమాను నెక్స్ట్ మార్చి రిలీజ్ లాక్ చేశాడు. చూస్తుంటే ఈసారి నాని చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అర్థమవుతుంది. నాని శ్రీకాంత్ ఓదెల ఈ ఇద్దరు మరోసారి అదరగొట్టేసేందుకు రెడీ అవుతున్నారు.