అలియా ఆల్ఫా.. రిస్కే కానీ..

బాలీవుడ్‌లో ఈమధ్య సక్సెస్ రేటు చాలా తగ్గింది అనుకుంటున్న సమయంలో ఛావా సినిమా వచ్చి ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చింది.;

Update: 2025-03-04 16:30 GMT

బాలీవుడ్‌లో ఈమధ్య సక్సెస్ రేటు చాలా తగ్గింది అనుకుంటున్న సమయంలో ఛావా సినిమా వచ్చి ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చింది. ఇక రాబోయే సినిమాలపై మెల్లగా అంచనాలు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈమధ్య స్టార్స్ హీరోయిన్స్ సోలోగా చేస్తున్న పెద్ద సినిమాలు అంతగా క్రేజ్ తెచ్చుకోవడం లేదు. ముఖ్యంగా స్పై యాక్షన్ జోనర్ అయితే అసలు రిస్కీ గేమ్. కానీ అలియా భట్ మాత్రం ఈ ఛాలెంజ్‌ని స్వీకరించింది. ఆల్ఫా అనే టైటిల్‌తో ఓ భారీ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

ఇది యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో వచ్చిన తొలి ఫీమేల్ లీడ్ మూవీ. అటు రాజీ లాంటి సినిమాలు చేస్తూనే, ఇటు మాస్ యాక్షన్ సినిమాలా ఉండే ఆల్ఫాని తీసుకోవడం చూస్తుంటే, ఆలియా కొత్త ట్రెండ్‌కి బీజం వేయబోతోందని అనిపిస్తోంది. సాధారణంగా స్పై యాక్షన్ సినిమాలు స్టార్ హీరోలతోనే బాగా కలెక్షన్లు రాబడతాయి. షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్స్ ఈ యూనివర్స్‌ని హిట్ చేశారని చెప్పాలి.

కానీ ఇప్పుడు అదే రూట్‌లో ఫీమేల్ లీడ్‌తో సినిమా రావడం ఊహించని విషయం. ఈ సినిమా విజయం సాధిస్తే, బాలీవుడ్‌లో స్పై యూనివర్స్ సినిమాల్లో హీరోయిన్స్‌కు కూడా ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఒకపక్క వార్ 2 రిలీజ్ అవ్వబోతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి భారీ కాంబినేషన్‌కి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే, దాని హైప్ ఆల్ఫాకు నిస్సందేహంగా ప్లస్ అవుతుంది.

కానీ వార్ 2 డిజాస్టర్ అయితే, ఆల్ఫా కూడా అదే దారిలో వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సినిమా విజయం సాధించాలంటే కంటెంట్ మేటర్. వారం రోజుల్లో రిజల్ట్ తేలిపోతుంది. ఓ పక్క అలియా భట్ ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతోంది. "ఇది నా కెరీర్‌లోనే అత్యంత స్ట్రాంగ్ రోల్, నా బాడీ లాంగ్వేజ్, యాక్షన్ ఎలిమెంట్స్‌కి ప్రేక్షకులు షాక్ అవ్వాల్సిందే" అంటూ తన కాన్ఫిడెన్స్ చూపిస్తోంది. కానీ ప్రేక్షకులు ఈ సినిమాని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

ఈ సినిమా హిట్ అయితే, ఆలియాకు భవిష్యత్తులో మరిన్ని మాస్ యాక్షన్ సినిమాలు చేసేందుకు మార్గం సుగమం అవుతుంది. ఇంకాస్త బోల్డ్‌గా చెప్పాలంటే, స్పై యాక్షన్ మూవీస్‌లో హీరోయిన్స్ ప్రామినెన్స్ పెరగడానికి ఇది ఓ దారితీస్తుంది. ఫ్లాప్ అయితే మాత్రం పక్కన పెట్టేయొచ్చు. హిట్టు అయితే మాత్రం ఫ్యూచర్‌లో అలియా లాంటి హీరోయిన్స్‌ని హీరోలకు పోటీగా నిలబెట్టే రోజులు దగ్గర్లోనే ఉంటాయి. ఈ ఒక్క హిట్టు పడితే ఆలియా భట్ బాలీవుడ్‌లో మరో లెవెల్‌కి వెళ్లిపోతుంది. ఇక తారక్‌-హృతిక్ మూవీతో వచ్చే బూస్ట్ ఆమె సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

Tags:    

Similar News