క్రికెటర్‌తో వ్యవహారంపై హీరోయిన్ క్లారిటీ
2015లో ప్రసారం అయిన టీవీ షోలో కనిపించడం ద్వారా మొదటి సారి పాపులారిటీని సొంతం చేసుకుంది.;
బుల్లితెర, వెండి తెరపై సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మ మహిరా శర్మ. ఈ అమ్మడు బాలీవుడ్‌లో మెల్ల మెల్లగా ఆఫర్లు దక్కించుకుంటూ తన స్థానం పదిలం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కెరీర్ ఆరంభంలో బుల్లి తెరపై ఎక్కువగా కనిపించిన ఈ అమ్మడు ఆ తర్వాత ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్‌లో కనిపిస్తుంది. నాగిన్ 3 వంటి సూపర్ హిట్ సీరియల్స్‌లో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ అమ్మడికి పాపులారిటీ లభించింది. చిన్న చిన్న పాత్రలు, ఆఫర్లతో కెరీర్‌ను ప్రారంభించిన మహిరా ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకుని బిజీ స్టార్ అయింది.
2015లో ప్రసారం అయిన టీవీ షోలో కనిపించడం ద్వారా మొదటి సారి పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఎన్నో షో ల్లో కనిపించింది. గడచిన పదేళ్లుగా ఈ అమ్మడు ఎన్నో పుకార్లను ఎదుర్కొంది. ఈమధ్య కాలంలో ఈమె క్రికెటర్ సిరాజ్‌తో డేటింగ్‌లో ఉందనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరికి సంబంధించిన కొన్ని ఫోటోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలు మార్ఫింగ్ అంటూ మహిరా కొట్టి పడేసింది. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న మహిరా శర్మ మాట్లాడుతూ సిరాజ్ తో ప్రేమ వ్యవహారంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
ప్రస్తుతం తన దృష్టి మొత్తం కెరీర్ పైనే ఉందని చెప్పుకొచ్చింది. ఏ ఒక్కరితోనూ తాను రిలేషన్‌లో లేను, తాను ఎవరితోనూ ప్రేమలో లేను, డేటింగ్‌కి సమయం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్ ఎవరితో అయినా సంబంధం కలిపేస్తారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటారు. వాటిని ఆపే పరిస్థితి లేదు. వాటిని నమ్మే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలంటూ జనాలకు మహిరా శర్మ విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వచ్చిన వెంటనే నిజమే అనుకోకుండా, కాస్త లోతుగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఆమె పేర్కొంది.
కొందరు ఎడిట్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. వాటికి అసలు ప్రాముఖ్యత ఇవ్వకూడదు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎడిట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉండటం వల్ల అవి కాస్త వైరల్ అయ్యి వ్యవహారం గురించి పుకార్లు మొదలు అవుతాయని ఆమె చెప్పుకొచ్చింది. కొన్ని రోజుల క్రితం మహీరా శర్మ తల్లి సానియా శర్మ సైతం పుకార్లను కొట్టి పారేశారు. మహీరా ఎవరితోనూ డేటింగ్ లో లేదని, ఆమె ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టిందని, నటిగా మరిన్ని సినిమాలు, సిరీస్‌లు చేయాలని ఆమె కోరుకుంటుందని సానియా శర్మ అన్నారు. దీంతో సిరాజ్‌తో నటి మహీరా శర్మ రిలేషన్ షిప్ వార్తలకు చెక్ పెట్టినట్లేనా అనేది చూడాలి.