అన్ని స్క్రీన్స్ లో ఇప్పుడు నిజంగా రిలీజ్ చేస్తారా?

Update: 2019-03-04 11:26 GMT
కొన్ని సినిమాలు భారీ హైప్ మధ్య రిలీజ్ అవుతాయి.  కానీ అంచనాలు అందుకోలేక చతికిలపడతాయి. పోయినేడాది అలా రిలీజ్ అయిన సినిమాలలో అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' ఒకటి. 'బాహుబలి' ని బీట్ చేస్తుందనుకుంటే తీరా అది బాక్స్ ఆఫీస్ దగ్గర తడిసిన లక్ష్మీ బాంబులా అసలు వెలగలేదు.  అలాంటి హైప్ మధ్య రిలీజ్ అయిన మరో సినిమా '2.0'. ఈ సినిమా అలా కాదు.. లక్ష్మీ  బాంబు పేలింది కానీ శబ్దం లేదు... తుస్సుమంది.  'బాహుబలి' కలెక్షన్స్ క్రాస్ చేయడం సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడిని పూర్తిగా వెనక్కు తీసుకురాలేక గుడ్లు తేలేసింది.

ఇప్పుడు  '2.0' చైనాలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా హక్కులను చైనాలోని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పోయినేడాదే దక్కించుకుందట.  ఈ సినిమాను భారీ స్థాయిలో 57 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని.. వాటిలో 47 వేల 3D స్క్రీన్లు ఉంటాయని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఇంతవరకూ ఏ ఇతర ఇండియన్ సినిమాకూ ఈ స్థాయిలో స్క్రీన్స్ లభించలేదు.  ఈ న్యూస్ వచ్చే సమయనికి '2.0' సినిమా రిజల్ట్ తెలియదు.  మరి ఇప్పుడు సినిమా సత్తా తెలిసిన తర్వాత కూడా ఈ స్థాయిలో రిలీజ్ అవుతుందా అనేది చూడాలి.  అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సరైన కంటెంట్ ఉంటే ఈ స్క్రీన్ కౌంట్ ఓకే కానీ ఇప్పుడు నిజంగానే అన్ని స్క్రీన్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరం.

ఒకవేళ చైనాలో ఈ సినిమా ఘన విజయం సాధించిన పక్షంలో ఈ సినిమాకు వచ్చిన నష్టాలను పూడ్చుకునే అవకాశం ఉంటుంది.  మేలో ఈ సినిమా  చైనా రిలీజ్ ఉంటుందట. త్వరలోనే డేట్ ప్రకటిస్తారని సమాచారం.
Tags:    

Similar News