క్లాసిక్ డైరెక్టర్ తో బోల్డ్ బ్యూటీ సెట్ట అవ్వడం కష్టమే!
బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు..క్లీన్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ఆయనో బ్రాండ్
బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా చిత్రాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు..క్లీన్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలో ఆయనో బ్రాండ్. క్లాసిక్ చిత్రాలు తెరకెక్కించడంలో సూరజ్ కి మంచి గుర్తింపు ఉంది. `మైనే ప్యార్ కియా` నుంచి `ఉంఛాయ్` వరకూ చేసినవి ఏడు సినిమాలే అయినా? దర్శకుడిగా ఆయన బ్రాండ్ వేసిన చిత్రాలవి. ఆయన సినిమాల్లో అశ్లీలతకు ఏమాత్రం ఛాన్స్ ఉండదు.
రొమాన్స్ లో బ్యూటీని ఎంతో అందంగా చూపించగల దర్శకుడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు బోల్డ్ బ్యూటీ ఎంపిక సవాల్ గా మారిందా? అంటే అవునే తెలుస్తోంది. సూరజ్ బర్జాత్యా తదుపరి `సంస్కారీ` చిత్రానికి సన్నధం అవుతున్నారు. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నాడు. ఖురానీకి జోడీగా త్రిప్తీ డిమ్రీ, సారా అలీఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే వీరిద్దరిలో ఎవరు ఎంపికవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఛాన్స్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ సూరజ్ ఆ ఛాన్స్ ఎవరికిస్తారు? అన్నది ఆసక్తికరం. అయితే సూరజ్ కథల్లో త్రిప్తీ డిమ్రీ ఏమాత్ర సరితూగదనే విమర్శ వినిపిస్తుంది. ఆమె గత సినిమాల ట్రాక్ రికార్డు చూసి సూరజ్ రాసే ఫ్యామిలీ పాత్రలకు సెట్ అవ్వడం కష్టమంటున్నారు. త్రిప్తీ పై ఇప్పటికే బోల్డ్ ఇమేజ్ ఉంది. ప్రేక్ష కుల్లో సైతం ఆ ఇమేజ్ బలంగా నాటుకుపోయింది.
ఈ నేపథ్యంలో ఆఇమేజ్ నుంచి బయట పడకుండా? కుటుంబ కథా చిత్రంలో ఫ్యామిలీ రోల్ పోషించడం అంటే? అంత సులభం కాదనే విమర్శ వినిపిస్తుంది. మరోవైపు సారా అలీఖాన్ ఈ చిత్రానికి తగినదే అయినా? బలమైన ఎమోషన్స్ పండించడంలో సారా వైఫల్యం చెందుతుందనే వాదన వినిపిస్తుంది. ఇలా త్రిప్తీ- సారా మధ్య `సంస్కారీ` రోల్ ఆసక్తికరంగా మారింది.