శ్రీ‌లీల క్రేజ్ ని క్యాష్ చేసుకుందామ‌నా?

Update: 2022-12-09 15:08 GMT
`కిస్` మూవీతో క‌న్న‌డ ప్రేక్ష‌కుల్నిత‌న గ్లామ‌ర్ తో  మెస్మ‌రైజ్ చేసిన బ్యూటీ శ్రీ‌లీల‌. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ‌ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గౌరీ రోనంకీ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన `పెళ్లిసంద‌D` మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోహ‌న్ హీరోగా న‌టించిన   ఈ మూవీతో శ్రీ‌లీల టాలీవుడ్ లో హాట్ కేక్ లా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా శ్రీ‌లీల అందానికి ఫిదా అయిపోతూ త‌నే కావాలంటూ వెంట‌ప‌డుతున్నారు.

పూజా హెగ్డే క్రేజ్ త‌గ్గిపోవ‌డం..కేవ‌లం త‌ను స్టార్ హీరోల సినిమాల‌కే ప‌రిమితం అయిపోవ‌డంతో శ్రీ‌లీల స్టార్ హీరోల నుంచి టైర్ టు హీరోలు, యంగ్ హీరోలకు హాట్ ఫేవ‌రేట్ గా మారిపోయింది. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `ధ‌మాకా`తో పాటు `జాతిర‌త్నాలు` ఫేమ్ న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ `అన‌గ‌న‌గా ఒక రాజు` మూవీలోనూ న‌టిస్తోంది. మ‌రి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్నాయి.

తెలుగులో శ్రీ‌లీల త్వ‌ర‌లో టాప్ స్టార్ గా క్రేజీ హీరోయిన్ గా స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని కొంత మంది నిర్మాత‌లు అప్పుడే ప్లాన్ లు వేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ నేప‌థ్యంలో శ్రీ‌లీల హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైన తన తొలి క‌న్న‌డ మూవీ `కిస్‌`ని తెలుగులో ఐ ల‌వ్ యు ఇడియ‌ట్‌` అనే పేరుతో రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఏపి అర్జున్ తెర‌కెక్కించిన ఈ మూవీ క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా వంద రోజులు ఆడి శ్రీ‌లీల‌కు బెస్ట్ డెబ్యూగా సైమా అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. 2019లో విడుద‌లైన ఈ మూవీలో హీరోగా విరాట్ న‌టించాడు. తెలుగులో ఈ మూవీని సాయి కిర‌ణ్ బ‌త్తుల‌, సుద‌ర్శ‌న్ డౌడ్ బ‌త్తుల‌, ఏపి అర్జున్ రిలీజ్ చేస్తున్నారు. డిసెంబ‌ర్ 17న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ మూవీతో మేక‌ర్స్ శ్రీ‌లీల క్రేజ్ ని ఏ రేంజ్ లో క్యాష్ చేసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News