రిబ్బను కటింగుల వేళ స్టార్ల హంగామా మామూలుగా ఉండదు. తమ అభిమాన తార అలా కళ్లముందుకు దేవతలా కదిలొస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్లలో గుచ్చేసుకునేందుకు అభిమానులు ఎంతగానో ఆత్రపడతారు. అందాల కథానాయికల్ని దగ్గరగా చూడాలని యూత్ అయితే ఆల్మోస్ట్ మీది మీదికి ఉరుకుతారు. ఆ దూకుడుకి రిబ్బను కటింగు మాటేమో కానీ.. అక్కడకు వచ్చిన సదరు కథానాయికకు ఊపిరి ఆగినంత పనే అవుతుంది. పబ్లిక్ లో ఇనాగురేషన్ అంటే ఇవన్నీ రెగ్యులర్ గా కనిపించే దృశ్యాలే.
పలువురు అందాల కథానాయికలు టూటైర్ సిటీలకు రిబ్బన్ కటింగులకు వెళితే ఆ ప్రాంతం అంతా ఊక వేస్తే రాలనంత మంది జనాలతో నిండిపోతుంది. వీలు కుదిరితే ఫోటో కానీ సెల్ఫీ కానీ దిగేందుకు అభిమానులు మీద పడే సందర్భాలే ఎక్కువ. ఓసారి ఉత్తరాదిన ఓ నగరంలో శృంగార తార సన్నీలియోన్ ఓ షాపు ఓపెనింగుకి వెళ్లి లోపలి నుంచి బయటికొచ్చి చూసి షాక్ తింది. చుట్టూ నాలుగు రోడ్ల జంక్షన్ జామ్ అయిపోయిన సన్నివేశం చూసి ఊపిరి తీసుకోలేకపోయింది. ఇలాంటి రచ్చ ను కంట్రోల్ చేసేందుకు నిర్వాహకులకు .. షాపు ఓనర్లకు తల ప్రాణం తోకకు వస్తుంది. ఇదిగో ఇక్కడ మిల్కీ వైట్ బ్యూటీ తమన్నాకు సేమ్ సీన్ ఎదురైంది. రిబ్బన్ కటింగ్ కని వెళితే సెల్ఫీ ప్లీజ్ అంటూ జనం గుమిగూడారు.
మిల్కీ ఓ నగరంలో మొబైల్ స్టోర్ కొత్త బ్రాంచీని లాంచ్ చేసేందుకు వెళితే అక్కడ జనం ఒక్కసారిగా మూగారు. సెల్ఫీలు కావాలి ప్లీజ్! అంటూ మీద మీదికి వచ్చారు. ఆ సన్నివేశంలో సెక్యూరిటీ సరిగా కంట్రోల్ చేయలేకపోతుంటే తమన్నా ముఖంలో రంగులు మారిపోవడం కనిపిస్తోంది. కాస్తంత చిర్రు బుర్రుగా చికాగ్గా పెట్టిందా ఫేసు. ఓవైపు మీడియా కెమెరాలు వెంటపడుతూ ఫ్లాష్ లు మెరిపిస్తుంటే మరింతగా ఇర్రిటేట్ అయ్యింది. మొత్తానికి ఆ సన్నివేశంలో ఏదో నెట్టుకొచ్చింది కానీ.. కోపం తారా స్థాయికి చేరేదే. ఆ మాత్రం అదుపు చేసి ఏదోలా అప్పటికి బయటపడ్డారు ఈవెంట్ నిర్వాహకులు. స్టార్లు నగరాల్లో షాపుల ఓపెనింగులు.. రిబ్బను కటింగులు అని వెళితే చాలా జాగ్రత్త పడాలని ఈ ఓపెనింగ్ కార్యక్రమం చెప్పింది. మరోవైపు తమన్నా ఇటు సౌత్- అటు బాలీవుడ్ రెండు చోట్లా కెరీర్ ని తెలివిగా ప్లాన్ చేసి గట్టెక్కకించేస్తున్న సంగతి తెలిసిందే.
Full View