అంజలి.. ట్రెడిషినల్ టచ్ తో స్టన్నింగ్ గ్లామర్ డోస్
సాఫ్ట్ లుక్స్‌లోనూ, మాస్ అవతారంలోనూ ఆకట్టుకునే తారగా అంజలి పేరు తెచ్చుకుంది.
సౌందర్యానికి, అభినయానికి నెలవైన అంజలి.. తెలుగు, తమిళ సినీప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి. సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఆమె, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తమిళంలో కెరీర్ ప్రారంభించినా, తెలుగులోనూ తనకంటూ మంచి స్థానం ఏర్పరుచుకుంది. సాఫ్ట్ లుక్స్‌లోనూ, మాస్ అవతారంలోనూ ఆకట్టుకునే తారగా అంజలి పేరు తెచ్చుకుంది.
ఇటీవల ఆమె వరుస సినిమాల్లో కనిపించకపోయినా, మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ‘గేమ్ ఛేంజర్’లో కీలక పాత్రలో కనిపించిన ఆమె, ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో మరోసారి తన ప్రతిభను చూపించింది. వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా ప్రేక్షకులకు చేరువవుతున్న అంజలి, కథానాయికగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటోంది.
తాజాగా అంజలి ట్రెడిషనల్ లుక్‌లో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైట్ పింక్ శారీలో ఆమె అందాన్ని ఇంకాస్త హైలైట్ చేసేలా ఉన్న ఈ ఫోటోలు, అందరికీ కనువిందు చేస్తున్నాయి. ఆమె చూపులతోనే తన అందాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. సింపుల్ స్టైలింగ్, మినిమల్ జ్యువెల్రీతో మరింత గ్రేస్‌ఫుల్‌గా కనిపించింది. ఇప్పటికే అనేక ప్రయోగాత్మక సినిమాలు చేసిన అంజలి, ప్రస్తుతం మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ఇటీవల పెద్దగా అవకాశాలు రాకపోయినా, ‘మ్యాడ్ 2’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందని సమాచారం. మరీ, ఈ అందమైన తారకు మళ్లీ పెద్ద సినిమాల్లో అగ్రహీరోలతో అవకాశాలు వస్తాయా? అనేది చూడాలి. ఇక ఇటీవల మధగధరాజా సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ అందుకున్న అంజలి ప్రస్తుతం మరికొన్ని డిఫరెంట్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.