నియ‌మ నిబంధ‌న‌ల‌తో సాయి ప‌ల్ల‌వికి స‌మ‌స్యేనా?

కెరీర్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి నేటివ‌ర‌కూ కేవ‌లం డీసెంట్ రోల్స్ మాత్ర‌మే చేసింది. తాను ఏ సినిమా చేసినా? అందులో హీరో ఉన్నా? హీరోతో పాటు త‌న పాత్ర కూడా అంతే బ‌లంగా ఉండేలా చూసుకుంది.;

Update: 2025-03-14 18:30 GMT

సాయి ప‌ల్ల‌వి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటుంద‌న్నది తెలిసిందే. ఎన్ని కోట్లు ఆఫ‌ర్ చేసినా? పాత్ర కోసం ప‌నిచేస్తుంది త‌ప్ప పారితోషికం కాద‌ని ఇప్ప‌టికే చాలా సినిమాలతో ప్రూవ్ చేసింది. గ్లామ‌ర్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఎన్నో అవ‌కాశాలు..కోట్లు గుమ్మ‌రించ‌డానికి నిర్మాత‌లు ముందుకొచ్చినా? నో వే అనేసింది. ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌లు ఆమెను ఒప్పించ‌డానికి ఎంత‌గా క‌ష్ట‌ప‌డాలి? అన్న‌ది ఇటీవ‌లే చందు మొండేటి మాట‌ల్లో అర్ద‌మైంది.

కెరీర్ మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి నేటివ‌ర‌కూ కేవ‌లం డీసెంట్ రోల్స్ మాత్ర‌మే చేసింది. తాను ఏ సినిమా చేసినా? అందులో హీరో ఉన్నా? హీరోతో పాటు త‌న పాత్ర కూడా అంతే బ‌లంగా ఉండేలా చూసుకుంది. ఈ విష‌యంలో సాయి ప‌ల్ల‌వి ఎంతో తెలివిగా స‌క్స‌స్ అయింది. ఎక్క‌డా గ్లామ‌ర్ , స్కిన్ షోల‌కు చోటు ఇవ్వ‌కుండా న‌టించింది. దీంతో సాయి ప‌ల్ల‌వితో సినిమా తీయాల‌నుకుంటే కొన్ని కండీష‌న్లు ఉంటాయి? అని దర్శ‌కుల‌కు అర్దం చేసుకుని..ఆమె అభిరుచి మేర‌కు పాత్ర‌లు రాయ‌డం మొద‌లు పెట్టారు.

ఇంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. మ‌రి ఇలాగే ఉంటే ఇండ‌స్ట్రీలో లాంగ్ కెరీర్ ఉంటుందా? అంటే అది క‌ష్ట‌మ‌నే నిపుణులు భావిస్తున్నారు. ఇండ‌స్ట్రీకి కొత్త నీరు వ‌చ్చే కొద్ది పాత నీరు పోవ‌డం స‌హ‌జం అన్న మాట‌ను గుర్తు చేస్తున్నారు. ఎంత ఫేం ఉన్నా? సీన్ డిమాండ్ చేసిందంటే? న‌టి పూర్తిగా డైరెక్ట‌ర్ కోణంలో న‌టించాల్సి ఉంటుంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ ఛాన్స్ సాయి ప‌ల్ల‌వి విష‌యంలో ఏ డైరెక్ట‌ర్ తీసుకోకోపోవ‌డంతో స‌మ‌స్య మొద‌ల‌వ్వ‌లేద‌ని అంటున్నారు.

ఆరోజు వ‌చ్చిన నాడు సాయి ప‌ల్ల‌వి కెరీర్ ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. కీర్తి సురేష్ కూడా 'మ‌హాన‌టి' స‌క్సెస్ త‌ర్వాత వ‌చ్చిన ఎన్నో అవ‌కాశాల‌ను ఇలాగే వ‌దులుకుంద‌ని..చివ‌రికి ఛాన్సులు త‌గ్గ‌డంతో? తాను కూడా ఓ మెట్టు దిగాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో లాంగ్ కెరీర్ ఉండాలంటే స‌క్సెస్ , ట్యాలెంట్ తో పాటు ద‌ర్శ‌క‌, ర‌చ‌యిత‌ల విజ‌న్ ని కూడా అర్దం చేసుకోవాల‌న్నారు. మొండి ప‌ట్టుద‌ల‌కు పోతే కెరీరే ప్ర‌శార్ధ‌కం అవుతుంద‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News