ప్రశాంత్ నీల్ దృష్టిలో వాళ్లంతా బ్యాడ్ డైరెక్టర్స్!
ప్రశాంత్ నీల్ నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ ఎవరంటే? ప్రశాంత్ నీల్ పేరు చెబుతారంతా.;
ప్రశాంత్ నీల్ నేడు పాన్ ఇండియాలో ఓ సంచలనం. రాజమౌళి తర్వాత ఆ రేంజ్ డైరెక్టర్ ఎవరంటే? ప్రశాంత్ నీల్ పేరు చెబుతారంతా. తెలుగు మూలాలున్న కన్నడిగా అన్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్`, `సలార్` లాంటి విజయాలతో పాన్ ఇండియాలో సృష్టించిన సంచలనాలతోనే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే నీల్ వరల్డ్ నుంచి మరిన్ని సీక్వెల్స్ కూడా రాబోతున్నాయి.
దర్శకుడిగా ప్రశాంత్ నీల్ తొలి చిత్రం `ఉగ్రం`. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్ తోనే పాన్ ఇండియాలో `కేజీఎఫ్` చిత్రం చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కాక ముందు? అప్పటి డైరెక్టర్లు చేసే చిత్రాలు చూసి ఇవేం సినిమాలు అనుకునేవాడుట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వాళ్లందర్నీ బ్యాడ్ డైరెక్టర్స్ గా భావించాడుట. ఇండస్ట్రీలో సినిమాలు తీసే విధానం మారాలని భావించేవాడుట.
కానీ ఓ సినిమా తీయడం అన్నది ఎంత కష్టం అన్నది తర్వాతే తెలిసొచ్చిందన్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసాడు. సినిమా చూడటం తేలికైన పని. కానీ తెరకెక్కించడం చాలా కష్టం. 2014 లో `ఉగ్రం` షూటింగ్ ప్రారంభం కాకముందు మేకింగ్ పరంగా మార్పులు రావాలని భావించాను. కానీ చిత్రీకరణ కొంత భాగం పూర్తయ్యాక అసలు విషయం అర్థమైంది.
ఈ సినిమా 10 మంది చూసినా చాలు అని. సినిమా నిర్మాణానికి టీమ్ అర్క్ అవసరం. అప్పుడే విజయం సాధించగలం. అందుకే ఫిల్మ్ మేకింగ్ అనేది టెన్నిస్‌లాంటిది కాదు క్రికెట్‌లాంటిది. జట్టుగా పని చేయాల్సి ఉంటుంది. అప్పట్లో సినిమాలు చేసిన వాళ్లంతా ఎంత గొప్ప వాళ్లో అర్దమవుతుంది. నా భావన పూర్తిగా తప్పు` అని ప్రశాంత్ నీల్ అన్నారు.