రాజా సాబ్.. ప్రభాస్ ఫ్యాన్స్ భయమే నిజమౌతుందిగా
రాజా సాబ్ 2025లోనే రిలీజ్ కాదని, వచ్చే ఏడాది సంక్రాంతి వైపు రాజా సాబ్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ అందరూ షాకైపోయారు. మారుతితో సినిమాను వ్యతిరేకిస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాంపైన్స్ కూడా నిర్వహించారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోను మారుతి ఏ మేరకు హ్యాండిల్ చేయగలడని అందరూ అనుమానపడ్డారు.
కానీ మారుతి, ప్రభాస్ మాత్రం ఈ ప్రాజెక్టు పై మొదటినుంచి చాలా నమ్మకంగా ఉన్నారు. మారుతి ఎన్నో సందర్భాల్లో తనపై వచ్చిన నెగిటివ్ టాక్ చూసి తానేం ఫీలవలేదని, అవన్నీ తనను మంచి అవుట్ పుట్ ఇవ్వడానికే ప్రేరేపిస్తాయి తప్పించి నిరాశ పరచవని చెప్పాడు. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ నుంచి మేకర్స్ రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా, ఆ గ్లింప్స్ చూశాక ప్రభాస్ ప్యాన్స్ ఒకింత శాటిస్‌ఫై అయ్యారు. గ్లింప్స్ లో ప్రభాస్ ను వింటేజ్ లుక్స్ లో చూపించగా అందరూ ఫిదా అయిపోయి మారుతిని నమ్మడం మొదలుపెట్టారు.
కానీ సినిమా మళ్లీ లేటవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. వాస్తవానికి రాజా సాబ్ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా ఏప్రిల్ 10 నుంచి వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజా పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే అసలు రాజా సాబ్ 2025లోనే రిలీజ్ కాదని, వచ్చే ఏడాది సంక్రాంతి వైపు రాజా సాబ్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
రాజా సాబ్ రిలీజ్ బాగా లేటవడంతో మారుతి విషయంలో ప్రభాస్ డెసిషన్ మరిన్ని ఊహాగానాలకు దారితీస్తున్నాయి. తాము మొదట్నుంచి భయపడుతుంది ఇందుకేనని, ప్రభాస్ లాంటి హీరోను మారుతి హ్యాండిల్ చేయగలడో లేదో అని తెలియకే అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనేం అయిందేదో అయిపోయిందని, ప్రభాస్ కు హిట్ సినిమా ఇవ్వమని మారుతిని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుతున్నారు. మారుతి చెప్పినట్టు సినిమాలో కామెడీ మరియు హార్రర్ బాగా పండి, సినిమా సంక్రాంతికి రిలీజైతే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో రాజా సాబ్ రికార్డులు సృష్టించొచ్చు. అసలే సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూడాలని ఫ్యామిలీలంతా వెయిట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఒకవిధంగా రాజా సాబ్ కు ఇది కూడా మంచి ఛాన్సే అని చెప్పాలి.