ఫోటో స్టోరి: బికినీ బ్యూటీ సోఫీ రెబ‌ల్ 'క్వీన్' వేషాలు

తాజాగా మ‌రో స్ట‌న్నింగ్ ఫోటోషూట్‌తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టింది ఈ కోల ముఖం బ్యూటీ. సోఫీ స్ట‌న్నింగ్ బికినీలో మైండ్ బ్లాక్ చేసింది.;

Update: 2025-03-15 00:30 GMT

సోఫీ చౌద‌రి అందాల ట్రీట్ గురించి చెప్పేదేముంది? బికినీలు స్విమ్ సూట్లతో ఈ భామ చెల‌రేగిపోతుంది. మోడ‌ల్, హోస్ట్, స‌హాయ న‌టి, ఐట‌మ్ గాళ్ గా బ‌హుముఖ ప్ర‌జ్ఞతో అల‌రించిన ఈ భామ బాలీవుడ్‌లో కెరీర్ ప‌రంగా వెన‌క‌బ‌డింది. అయినా 40 ప్ల‌స్ ఏజ్ లోను వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టిస్తూ ప‌లు బ్రాండ్ల‌కు ప్ర‌చార‌క‌ర్త‌గా బాగానే ఆర్జిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో వేడెక్కించే ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తూ నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది.

 

తాజాగా మ‌రో స్ట‌న్నింగ్ ఫోటోషూట్‌తో కుర్ర‌కారు మ‌తులు చెడ‌గొట్టింది ఈ కోల ముఖం బ్యూటీ. సోఫీ స్ట‌న్నింగ్ బికినీలో మైండ్ బ్లాక్ చేసింది. డ్యూయ‌ల్ క‌ల‌ర్ ఇన్న‌ర్ ధ‌రించిన సోఫీ క్వీన్ అనే టైటిల్ తో ఉన్న హ్యాట్ ని ధ‌రించింది. నేప‌థ్యంలో బులుగు జిలుగు స‌ముద్రం త‌న అందాన్ని మరింత ఇనుమ‌డింప జేసింది.

తాజా ఫోటోషూట్ కి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించింది. ''మహిళలకు ఒక రోజు అవసరం లేదని నేను నమ్మను. ప్రతి రోజు మనదే! అవును... కిరీటాలు ఎల్లప్పుడూ కనిపించవు, కానీ ప్రతి స్త్రీ ఒక కిరీటం ధరిస్తుంది. కాబట్టి క్వీన్ లా ప్రకాశించండి.. ఈ రోజు & ప్రతి ఒక్క రోజు! అన్ స్టాప‌బుల్‌గా ఉండండి'' అని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. స‌ముద్ర తీరంలో సోఫీ గుబులు పుట్టించే ఫోజుల‌తో హార్ట్ లో ద‌డ పుట్టించింద‌ని, హా* అంద‌చందాలు మ‌తులు చెడ‌గొడుతున్నాయంటూ యూత్ రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువ‌త‌రం వాట్సాపుల్లోను వైర‌ల్ గా మారుతున్నాయి.

సోఫీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. 'షాది నెంబ‌ర్ 1' సినిమాతో బాలీవుడ్ లో ప్ర‌వేశించింది. ఆ త‌ర్వాత 'ప్యార్ కే సైడ్ ఎఫెక్స్ట్'.. 'ఐ సీయూ' స‌హా ప‌లు రొమాంటిక్ కామెడీల‌లో న‌టించింది. ఆ త‌ర్వాత ఐట‌మ్ గాళ్ గాను పాపుల‌రైంది. మ‌హేష్ '1 నేనొక్క‌డినే' లో 'లండ‌న్ బాబులు..' అంటూ సాగే ప్ర‌త్యేక గీతంతో అల‌రించిన సోఫీ, సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో టాలీవుడ్ లో క‌నిపించ‌లేదు. యోగా క్లాసులు, మోడ‌లింగ్ తో ప్ర‌స్తుతానికి కెరీర్ బండి న‌డిపిస్తోంది.

Tags:    

Similar News